సోదరుడే నా నిజమైన మిత్రుడు : జాగ్రత్తగా చూసుకోండి.. ప్రియాంకా భావోద్వేగ ట్వీట్

priyanka - rahul
Last Updated: గురువారం, 4 ఏప్రియల్ 2019 (16:07 IST)
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఇందుకోసం ఆయన గురువారం తన సోదరి ప్రియాంకా వాద్రా గాంధీతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ప్రియాంకా ఓ భావోద్వేగ ట్వీట్ చేసింది. "రాహుల్ తన నిజమైన మిత్రుడని, ఆయనను జాగ్రత్తగా చూసుకోవాలని ప్రజలను" కోరారు.

"నా సోదరుడు, నా నిజమైన మిత్రుడు, ఇప్పటివరకు నాకు తెలిసిన అత్యంత ధైర్యసాహసాలుగల వ్యక్తి. వయనాద్! ఆయనను జాగ్రత్తగా చూసుకో, ఆయన నిన్ను తక్కువ చేయడు" అని ప్రియాంక ట్వీట్ చేశారు. కాగా, ప్రియాంక గాంధీ తూర్పు ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సంగతి తెలిసిందే. వయసునుబట్టి చూస్తే ఆమె రాహుల్ కన్నా రెండేళ్ళు చిన్నది. మరోవైపు, రాహుల్ గాంధీ అమేథీ స్థానంలో కూడా పోటీ చేయనున్నారు.దీనిపై మరింత చదవండి :