రిగ్గింగ్ చేసినా నేనే గెలుస్తా: కొండా విశ్వేశ్వర రెడ్డి

Konda Vishweshwar Reddy
Last Updated: బుధవారం, 10 ఏప్రియల్ 2019 (13:55 IST)
ఈనెల 11వ తేదీన జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చూపాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. జోరుగా ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. చేవెళ్ల లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు సక్రమంగా జరిగితే తనకు 2 లక్షల పైచిలుకు మెజారిటీ వస్తుందని, అధికార తెరాస రిగ్గింగ్ చేసినా తానే గెలుస్తానని, రెండో స్థానం కోసం తెరాస, బీజేపీలు పోటీపడుతున్నాయని అన్నారు.

మరోవైపు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి అడ్వొకేట్ సందీప్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలి సిన్ టవర్స్‌లో సోదాలు నిర్వహించిన పోలీసులు సందీప్ వద్ద నుండి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు రూ.15 కోట్ల డబ్బును ఓట్ల కోసం పంపిణీచేసినట్టు తెలుస్తోంది. పంపకాల వివరాలన్నీ కోడింగ్ రూపంలో ఉండటంతో వాటిని డీకోడ్ చేసే పనిలో ఉన్నారు. రూ.15 కోట్ల పైచిలుకు నగదుని కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సందీప్ రెడ్డి కలిసి పంచినట్లుగా గుర్తించారు.దీనిపై మరింత చదవండి :