జై జనసేన... నా ఓటు పవన్ కళ్యాణ్‌కే... మంచు మనోజ్ ట్వీట్

Pawan-Manoj
Last Modified శనివారం, 23 మార్చి 2019 (20:48 IST)
ఒకవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్ పైన నటుడు మోహన్ బాబు తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తున్నారు. అంతేకాదు... ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపైన విమర్శలు చేస్తున్నారు. మరోవైపు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాల గురించి పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు. ఇదిలావుండగా మంచు ఫ్యామిలీ తెదేపాకు వ్యతిరేకంగా వైసీపికి అనుకూలంగా వ్యవహరిస్తోందనుకుంటున్న తరుణంలో మంచు మనోజ్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

జై జనసేన, నా ఓటు పవన్ కల్యాణ్‌కేనంటూ తన మద్దతు పవర్ స్టార్‌కేనని వెల్లడించారు. ఐతే తను తారక్ రాజకీయ రంగంలోకి దిగితే మాత్రం అతని ప్రాణానికి తన ప్రాణం అడ్డేస్తానంటూ ట్వీట్ చేశారు. దీనితో ఇపుడంతా మంచు మనోజ్ ట్వీట్లపై చర్చించుకుంటున్నారు.దీనిపై మరింత చదవండి :