అదేముందమ్మా.. దేవుడు ఆశీర్వదిస్తే 175 సీట్లూ మావే : వైఎస్. భారతి

ys bharati
Last Updated: గురువారం, 11 ఏప్రియల్ 2019 (12:13 IST)
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీతో పాటు దేశవ్యాప్తంగా 91 లోక్‌సభ స్థానాలకు గురువారం ఉదంయ పోలింగ్ జరుగుతోంది. దీంతో అనేక మంది రాజకీయ నేతలు, సెలెబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్.భారతి కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, ధైర్యవంతుడైన యువ నాయకుడిని, విశ్వసనీయత ఉన్నవాడిని గెలిపించాలని యువ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు మేడం.. ఈసారి మీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? అని ప్రశ్నించారు. దీంతో 'అదేముందమ్మా.. దేవుడు ఆశీర్వదిస్తే 175 సీట్లు కూడా వస్తాయి' అని నవ్వుతూ సమాధానమిచ్చారు. నిజాయితీ, విశ్వసనీయత, విలువలతో కూడిన రాజకీయం చేసేవారికి ఓటేయాలని తొలిసారి ఓటు హక్కు పొందిన యువతను వైఎస్ భారతి మరోసారి కోరారు.దీనిపై మరింత చదవండి :