అక్బరుద్దీన్‌పై ఎన్ఐఎకి ఫిర్యాదు... శ్రీరాముని తల్లిపై కామెంట్ చేశారా...?

MIM Akbaruddin
Venkateswara Rao. I|
FILE
అక్బరుద్దీన్ పై ప్రభుదాస్ అనే వ్యక్తి ఎన్ఐఎకి ఫిర్యాదు చేశారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలు ఆయన మెడకు రోజురోజుకీ ఉచ్చు మరింత బిగుస్తున్నాయి. శ్రీరాముని తల్లిపై అక్బరుద్దీన్ అనుచిత వ్యాఖ్యలు చేశారనీ, అలాంటి వ్యక్తి బహిరంగ సభల్లో మాట్లాడితే దేశ భద్రతకే ముప్పు వాటిల్లుతుందని ప్రభుదాస్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.

తన ఫిర్యాదులో అక్బరుద్దీన్ ఇకపై బహిరంగ సభలో పాల్గొనకుండా చూడాలని కోరారు. శ్రీరాముని తల్లి గురించి అక్బరుద్దీన్ అనుచిత వ్యాఖ్యలు చేశారనీ, ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ కూడా దీనిని ప్రసారం చేసిందని తెలిపారు.

గతంలో ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్న కొన్ని వ్యాఖ్యలను భారత ప్రభుత్వ నిషేధించిందనీ, అలాగే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే అంతర్జాలం నుంచి తొలగించాలని కోరారు. ఈ ఫిర్యాదును అందుకున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై దర్యాప్తు చేస్తోంది.


దీనిపై మరింత చదవండి :