చంచల్గూడ జైలుకు చెందిన వీవీఐపీ ఖైదీలంతా బుధవారం గగన్ విహార్ కోర్టులో కలుసుకున్నారు. వీరంతా జగన్ అక్రమాస్తుల కేసుతో పాటు.. ఓబుళాపురం అక్రమ మైనింగ్, వాన్పిక్ భూముల కేటాయింపుల్లో చోటు చేసుకున్న అవకతవకల కేసుల్లో అరెస్టు అయి చంచల్గూడా జైలులో ఉన్నారు. వీరి రిమాండ్ గడువు బుధవారంతో ముగిసింది. దీంతో వీరిని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా, ఈ కేసులను విచారిస్తున్న న్యాయమూర్తి ధర్మారావు సెలవుపై ఉండటంతో గగన్ విహార్ కోర్టులో హాజరుపరిచారు.