డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి భర్త మృతి

PNR|
డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యురాలు సత్యవతి రాథోడ్ గోవింద్ రాథోడ్ సోమవారం రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. అయితే, ఈయన మృతి వెనుక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మోటర్‌ బైక్‌పై వెళుతున్న గోవింద్‌ రాథోడ్‌ ఘట్‌కేసర్‌ వద్ద రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందినట్లు పోలీసులు ప్రాథమిక సమాచారం అందించారు.

అయితే ఆయనను ప్రత్యర్థులు హత్యచేసి ఉంటారని ఆయన సన్నిహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైల్వేలో గోవింద్ రాథోడ్‌ ఏఎస్సైగా పనిచేస్తున్న సమయంలో ఉన్న మనస్పర్థలే ఈ హత్యకు కారణమై ఉండవచ్చని సన్నిహితులు భావిస్తున్నారు.

కాగా, డోర్నకల్‌లో వరుసగా ఐదుసార్లు గెలిచి రికార్డు సృష్టించిన కాంగ్రెస్ నేత రెడ్యానాయక్‌ను గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన మహిళా నేత సత్యవతి రాథోడ్‌ ఓడించిన విషయం తెల్సిందే.


దీనిపై మరింత చదవండి :