సొంత పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత ఎంపీలపై ప్రభుత్వ విప్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి మరోమారు నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు నెక్లెస్ రోడ్డులో జరిగిన తెలంగాణ మార్చ్‌లో పాల్గొనే దమ్మూధైర్యం లేకే, సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారని ఆరోపించారు.