తెలంగాణ సాయుధ పోరాట యోధుడు గౌర్ కన్నుమూత

PNR| Last Modified శుక్రవారం, 7 అక్టోబరు 2011 (18:08 IST)
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, తొలితరం కమ్యూనిస్టు వృద్ధనేత, కార్మిక సంఘాల నాయకుడు రాజ బహదుర్ గౌర్ శుక్రవారం కన్నుమూశారు. ఇటీవల తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ వచ్చిన చికిత్స కోసం ఆస్పత్రిలో చేరగా ఆయన అక్కడే కన్నుమూసినట్టు వైద్యులు వెల్లడించారు. ఈయనకు వయస్సు 93 సంవత్సరాలు.

హైదరాబాద్ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కామ్రేడ్స్ అసోసియేషన్ ఏర్పాటులో గౌర్ కీలక పాత్ర పోషించారు. ఈయన జైలులో ఉండగానే 1952లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయనను విడుదల చేయాలని రాజ్యసభకు ఎన్నికైన తర్వాత భారత ప్రభుత్వం ఆదేశించింది. గౌర్ మృతికి పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు.


దీనిపై మరింత చదవండి :