ధర్మాన ప్రసాదరావు రాజీనామా: సీఎం కిరణ్‌కు లేఖ!

SELVI.M|
FILE
శాసనసభ్యత్వానికి మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామా చేశారు. వెంటనే తన రాజీనామా లేఖను శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సమర్పించారు. ఆయనతో పాటు మరో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేశారు.

సమైక్యాంధ్రకు మద్ధతుగా రాజీనామా చేసినట్లు ధర్మాన తెలిపారు. క్విడ్ ప్రోకో కేసులో ఆరోపణలు రావడంతో కొన్ని నెలల కిందట ధర్మాన మంత్రి పదవిని వీడిన సంగతి తెలిసిందే.

కాగా, సీఎం చేసిన వ్యాఖ్యలపై తెలంగాణవాదులు ఫైర్ అవుతున్నారు. అయితే సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతమవుతోంది. ఈ నేపథ్యంలో కిరణ్ రెడ్డి రాష్ట్ర విభజనతో సమస్యలు ఏర్పడుతాయని చేసిన వ్యాఖ్యలు తెలంగాణావాదుల్లో చిచ్చుపెట్టింది.


దీనిపై మరింత చదవండి :