ప్రముఖ రచయిత, పాత్రికేయుడు పతంజలి మృతి

SELVI.M|
ప్రముఖ రచయిత, పాత్రికేయుడు కె.వై.ఎన్ పతంజలి మరణించారు. విజయనగరం జిల్లా ఆలమండకు చెందిన ఆయన క్యాన్సర్‌తో కన్నుమూసినట్లు పతంజలి కుటుంబీకులు వెల్లడించారు. విశాఖలోని సింహాద్రి ఆస్పత్రిలో కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న పతంజలికి ఆరోగ్యం విషమించడంతో బుధవారం పరమపదించారని వారు తెలిపారు.

విజయనగరం జిల్లా ఆలమండకు చెందిన ఆయన వృత్తిరీత్యా అనేక దిన పత్రికల్లో ఎడిటర్‌గా పనిచేశారు. ఆయన రాసిన నవలల్లో ఆత్మకథ, ఒక దెయ్యం ఆత్మకథ, గో పాత్రుడు, వీర బొబ్బిలి, అప్పన్న సర్దార్ వంటివి చాలా ప్రాచుర్యం పొందాయి. టీవీ9, సాక్షి దిన పత్రికల్లో పనిచేసిన ఆయన ఎన్నో కథలు కూడా రాశారు.

ఇకపోతే.. పతంజలి మృతికి జర్నలిస్టుల సంఘం ప్రగాఢ సంతాపం తెలిపింది. ఆయన స్వగ్రామమైన ఆలమండలో గురువారం పతంజలికి అంత్యక్రియలు జరుగుతాయి.


దీనిపై మరింత చదవండి :