మాజీ మంత్రి ముద్దసాని దామోదర రెడ్డి మృతి చెందారు!!

xx|
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి ముద్దసాని దామోదర రెడ్డి సోమవారం మృతి చెందారు. ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముద్దసాని దామోదర రెడ్డి చికిత్స పొందుతూ నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్) ఆసుపత్రిలో మృతి చెందారు.

ముద్దసాని దామోదర రెడ్డి నాలుగుసార్లు శాసనసభ్యుడిగా పని చేశారు. కరీంనగర్ జిల్లా కమలాపూర్ నుండి ఆయన ఈ నాలుగుసార్లు ప్రాతినిథ్యం వహించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన యువజన వ్యవహారాలు, పర్యాటక శాఖ, రవాణా శాఖ, సాంకేతిక మంత్రిగా పని చేశారు.

ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారక రామారావుల హయాంలో ఆయన మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం ఆయన అదే జిల్లాకు చెందిన హుజురాబాద్ నియోజకవర్గానికి ఇంచార్జుగా ఉన్నారు. ఈయనకు భార్య, ఓ కుమారుడు ఉన్నారు.


దీనిపై మరింత చదవండి :