మొన్నటి ఉప ఎన్నికల్లో విజయమ్మతోపాటు ప్రచార బరిలో వైఎస్సార్ కుమార్తె షర్మిల మాటల దాడికే అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశం పార్టీలు మట్టికరిచాయన్న నిర్ణయానికి ఆ రెండు పార్టీల్లోని కొంతమంది నాయకులు నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ వైకాపాను ఎదుర్కోవాలంటే షర్మిల స్టామినాను ధీటుగా ఎదుర్కొనగల యువతి కోసం అటు తెదేపా ఇటు కాంగ్రెస్ పార్టీలు వెతికే పనిలో పడ్డట్టు సమాచారం.