గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 14 సెప్టెంబరు 2014 (18:04 IST)

బతుకమ్మ.. కేసీఆర్ సోనియాను ఆహ్వానించాలి: డీకే అరుణ

బతుకమ్మ పండుగను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబ పండుగలా కాకుండా రాష్ట్ర పండుగలా జరపాలని మాజీ మంత్రి డి.కె. అరుణ అన్నారు. ఈ పండుగకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీని కేసీఆర్‌ స్వయంగా ఆహ్వానించాలని ఆమె సూచించారు. అదే విధంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను విమర్శించడం మానుకోవాలని ఆమె హెచ్చరించారు.
 
ఈ సందర్భంగా ఆదివారం డి.కె. అరుణ మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాంగ్రెస్‌ పార్టీని విమర్శించినప్పుడల్లా టీపీసీపీ అధ్యక్షుడిని విమర్శించడం, అవమానించే విధంగా టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని, ఆ రకంగా వ్యాఖ్యలు చేయడాన్ని విరమించుకోవాలని ఆమె సూచించారు.