శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chitra
Last Updated : గురువారం, 30 జూన్ 2016 (14:29 IST)

అమ్మా నన్ను క్షమించు, నేను తప్పు చేయలేదు, ఇప్పటికైనా నన్ను నమ్మండి: సూసైడ్ నోట్‌లో విద్యార్థిని

అవమానం భరించలేని ఓ అమ్మాయి తన నిండు జీవితాన్ని బలితీసుకుంది. తనపై తప్పులేదని ఎంత వారించినా ఎవరూ నమ్మకపోవడం ఆమెను మరింత బాధించింది. ఈ అవమానాన్ని భరించడం కంటే చావడమే మేలనుకుని ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని

అవమానం భరించలేని ఓ అమ్మాయి తన నిండు జీవితాన్ని బలితీసుకుంది. తనపై తప్పులేదని ఎంత వారించినా ఎవరూ నమ్మకపోవడం ఆమెను మరింత బాధించింది. ఈ అవమానాన్ని భరించడం కంటే చావడమే మేలనుకుని ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే అనకాపల్లి మళ్లవీధికి చెందిన మళ్ల ధరణి (17) పట్టణంలోని హిమశేఖర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. కాలేజీలో సీనియర్ విద్యార్థి గణేష్‌తో నాలుగు రోజుల క్రితం గొడవ జరిగింది. 
 
అదేంటంటే... గణేష్ ఫస్టియర్‌లో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. ఈ విషయమై అతడి ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్న సమయంలో ధరణి అక్కడే ఉంది. మరోపక్క ధరణి తన ఫ్రెండ్స్‌తో సరదాగా మాట్లాడుకుంటూ నవ్వింది. అయితే ధరణి తనను చూసి ఎగతాళిగా నవ్విందని గణేష్ పొరపాటుపడ్డాడు. కోపం కట్టలు తెంచుకున్న గణేష్ నన్ను చూసి నవ్వుతావా... అంటూ క్లాస్‌రూమ్‌లో అందరూ చూస్తుండగా ధరణి చెంప చెళ్లుమనిపించాడు. 
 
అందరిముందు తనను కొట్టాడని ధరణి అవమానభారంతో కుంగిపోయింది. ఈ విషయమై కరెస్పాండెంట్‌కు ఫిర్యాదు చేస్తే.. యాక్షన్ తీసుకోక పోగా ఇద్దరినీ తిట్టి పంపించాడు. దీనికితోడు సీనియర్ల వెక్కిరింపులు మరింత ఎక్కువైంది. దీంతో ధరణి తీవ్ర ఆవేదన చెందింది. తన నిజాయితీని నిరూపించుకునేందుకు చావే గతి అని ఆత్మహత్య చేసుకుంది. చనిపోయేముందు...''అమ్మా నన్ను క్షమించు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఇప్పటికైనా నన్ను నమ్మండి అంటూ'' ధరణి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు.