గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 23 జూన్ 2014 (14:23 IST)

మెట్రో రైలు మార్గానికి మరో మూడు రైళ్లు!

తొలి విడతగా ప్రారంభం కానున్న నాగోల్ - మెట్టుగూడ మధ్య మెట్రో రైలు మార్గానికి మరో మూడు రైళ్లు చేరుకున్నాయి. దక్షిణ కొరియా నుండి భౌరీ నౌక ద్వారా చెన్నై పోర్టుకు..అక్కడి నుండి రోడ్డు మార్గంలో ప్రత్యేకంగా సిద్ధం చేసిన మల్టీవీల్ట్ రోడ్ ట్రయలర్స్ ద్వారా ఉప్పల్ మెట్రో డిపోకు మెట్రో రైళ్లను తరలించారు. పదిరోజుల పాటు రోడ్డు మార్గం గుండా ప్రయాణించిన 3 రైళ్లు ప్రజలను ఆకర్షించాయి.
 
శనివారం రాత్రి ఉప్పల్ మెట్రో డిపోకు చేరుకున్నాయి. ఈ మెట్రోరైళ్లను ముందుగా ఉప్పల్ మెట్రో డిపోలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాక్‌లో రెండు మూడు రోజుల్లో ప్రయోగాత్మకంగా నడిపి చూడనున్నారు. దక్షిణ మధ్య రైల్వే సేఫ్టీ అధికారులు సర్టిఫికెట్ జారీ చేసిన తర్వాతే నాగోల్-మెట్టుగూడ ఎలివేటెడ్ మార్గంలో ఇవి రాకపోకలు సాగించనున్నాయి. వచ్చే సంవత్సరం ఉగాది నాటికి ముందుగా నాగోల్ - మెట్టుగూడ మార్గంలో మొదటి మెట్రోరైలు ప్రయాణికులతో పరుగులు తీస్తుంది.