బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 జనవరి 2015 (12:05 IST)

సెక్స్ వర్కర్ల వీరగం: జూ. ఆర్టిస్టుపై దాడి.. అర్ధనగ్న డ్యాన్స్‌లు!

సికింద్రాబాద్‌లో గురువారం రాత్రి సెక్స్ వర్కర్లు వీరగం సృష్టించారు. తాగిన మత్తులో జూనియర్ ఆర్టిస్టుపై మూకుమ్మడి దాడి చేశారు. సికింద్రాబాదు రైల్వేస్టేషన్‌లో మొదలైన వీరి వీరంగం గోపాలపురం పోలీస్ స్టేషన్‌లోనూ కొనసాగింది.
 
వివరాల్లోకెళితే... జూనియర్ ఆర్టిస్ట్ గార్లపాటి శివకుమార్ గుంటూరు వెళ్లేందుకు సికింద్రాబాదు రైల్వే స్టేషన్లో రైలు కోసం వేచి ఉన్నాడు. తనవద్దకు యాచనకు వచ్చిన ముగ్గురు సెక్స్ వర్కర్లకు అతడు చిల్లర వేశాడు. 
 
చిల్లర చూసిన సెక్స్ వర్కర్లు అతడిని నానా దుర్భాషలాడుతూ, అతడి జేబులో ఉన్న నగదును లాగేసుకునేందుకు యత్నించారు. దీంతో, అతడు పరుగులు పెట్టగా, వెంటపడిన ఆ మహిళలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో శివకుమార్ తలకు తీవ్ర గాయమైంది. 
 
అక్కడి ప్రయాణికులు ఈ తతంగాన్నంతా ప్రేక్షకుల్లా చూస్తూ నిలబడిపోగా, అటుగా వెళుతున్న గోపాలపురం పోలీసులు మహిళలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌లోనూ సదరు మహిళలు వీరంగం సృష్టించారు. 
 
స్టేషన్ లోని పూలకుండీలను పగులగొట్టడమే కాక అర్ధనగ్నంగా నృత్యాలు కూడా చేశారు. దీంతో కంగుతిన్న పోలీసులు, వారిని రెచ్చగొడుతున్న గ్యాంగ్ లీడర్ చాంద్ బాషాను అరెస్ట్ చేశారు.