శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 22 జనవరి 2017 (08:33 IST)

హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్... గాఢ నిద్రలో ఉండటం వల్లే అధిక ప్రాణనష్టం.. ప్రమాదం వెనుక ఉగ్రకుట్ర?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 31 మంది దుర్మరణం పాలయ్యారు. వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మృతుల సంఖ్య మంత్రిగా పెరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 31 మంది దుర్మరణం పాలయ్యారు. వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మృతుల సంఖ్య మంత్రిగా పెరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెపుతున్నారు. 
 
జగదల్‌పూర్‌ నుంచి భువనేశ్వర్‌ వెళ్తున్న హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు శనివారం అర్థరాత్రి పట్టాలు తప్పింది. సుదీర్ఘమైన ప్రయాణం.. చిమ్మ చీకటి.. దాదాపు 100 కిలోమీటర్ల వేగం.. అంతా నిద్రలోకి జారుకున్నారు. ఇంతలో పెద్ద శబ్దం.. మెలకువ వచ్చి చూసేసరికి హాహాకారాలు.. ఇదీ శనివారం అర్థరాత్రి విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు రైల్వేస్టేషన్‌ సమీపంలో జరిగిన ప్రమాదం దృశ్యం. ఈ ప్రమాదంలో ఇంజన్‌ సహా మొత్తం 9 బోగీలు పట్టాలు తప్పాయి. 
 
గతేడాది నవంబరులో కాన్పూర్‌ సమీపంలో ఇండోర్‌-పట్నా ఎక్స్‌ప్రెస్‌ రైలు దుర్ఘటన మరవక ముందే హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కూడా కాన్పూర్‌ సమీపంలో జరిగిన రైలు ప్రమాదం తరహాలోనే ఉంది. అందరూ గాఢ నిద్రలో ఉండగా రైలు పట్టాలు తప్పడంతో పెద్దఎత్తున ప్రాణ నష్టం వాటిల్లింది. కాన్పూర్‌ రైలు ప్రమాదంలో 14 బోగీలు చెల్లా చెదురవడంతో 143 మంది చనిపోయారు. హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌లో 9 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ రెండు ప్రమాదాలూ రైలు పట్టాలు తప్పడం వల్లే జరిగాయి. 
 
అయితే, కాన్పూర్‌ రైలు ప్రమాదం వెనుక ఉగ్రవాద కుట్ర కూడా ఉండొచ్చని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల బీహార్‌లో కొందరు అనుమానితులు పట్టుబడినపుడు వారిని విచారించగా.. కాన్పూర్‌ రైలు ప్రమాదం వెనుక ఉగ్రకుట్రకు సంబంధించిన సమాచారం వెల్లడైంది. ఇపుడు కాన్పూర్‌ రైలు ప్రమాదం లాగానే.. హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ కూడా ప్రమాదానికి గురికావడంతో దీని వెనుక కూడా ఉగ్రవాదుల కుట్ర ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.  
 
హెల్ఫ్‌లైన్ నెంబర్లు: ల్యాండ్‌లైన్: 08922-221202, 08922-221206, 0891-2746344, 0891-2746330. 
సెల్ నెంబర్స్: 08500358610, 08500358712.