శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 28 నవంబరు 2015 (14:03 IST)

గంటా సొంతూరు విశాఖ కాలేజీలోనూ ర్యాంగింగ్: సీనియర్లపై సస్పెండ్ వేటు

ర్యాంగింగ్‌‌ను అరికట్టేందుకు ఏపీ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్రంగా శ్రమిస్తుంటే.. ఆయన సొంతూరు విశాఖలోనే ర్యాంగింగ్ చర్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. విశాఖలోని పాలిటెక్నిక్ కళాశాలలో సీనియర్ విద్యార్థులు జూనియర్లపై వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ విషయం వారం తర్వాత వెలుగులోకి వచ్చింది. 
 
విశాఖ పాలిటెక్నిక్ కళాశాలలో జూనియర్ విద్యార్థులపై సీనియర్లు ఓవరాక్షన్ చేస్తున్నారని తెలిసింది. అంతేగాకుండా జూనియర్ల ఫిర్యాదులతో వేగంగా స్పందించిన కళాశాల అధికారులు ర్యాగింగ్‌కు పాల్పడ్డ ఎలక్ట్రికల్ సెకండియర్ విద్యార్థులు రాహుల్, యశ్వంత్, దిలీప్ పృథ్వీ, స్టీఫెన్‌లను సస్పెండ్ చేశారు. 
 
కళాశాలకు సీనియర్ విద్యార్థులు మద్యం తాగి వస్తున్నారని, విద్యార్థినీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని కూడా ఫిర్యాదులు అందడంతో ఆయా విద్యార్థులపై సస్పెండ్ వేటు వేసినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. ఇకపోతే.. ర్యాంగింగ్ పేరిట ఓవరాక్షన్ చేసే సీనియర్ల ఆటలకు బ్రేక్ వేసే దిశగా కాలేజీలో కొత్త స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు.