శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 18 అక్టోబరు 2014 (12:50 IST)

ఐదేళ్ల చిన్నారిపై కామాంధుడు అత్యాచారం

కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ గిరిజన యువకుడు అభంశుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం సేవాలాల్‌తండాలో శుక్రవారం మిట్టమధ్యాహ్నం ఐదేళ్ల బాలికపై అఘాత్యానికి పాల్పడ్డాడు.   
 
అదే ప్రాంతానికి చెందిన గిరిజన యువకుడు లకావత్ బిక్షపతి(19) బాలిక తల్లిదండ్రులు ఇంట్లోలేని సమయంలో చిన్నారికి రూ.12 ఇచ్చి, ఆమెను వారి ఇంట్లోకే తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం బాధిత చిన్నారి, బయటకు వచ్చి రోధించడాన్ని గుర్తించిన గ్రామస్థులు, జరిగిన ఘటనను తెలుసుకొని యువకుడికి దేహశుద్ధి చేశారు.
 
అనంతరం పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు, బాధిత చిన్నారిని వైద్యచికిత్స కోసం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.