గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 17 డిశెంబరు 2014 (19:36 IST)

స్కూల్ ఫీజు చెల్లించలేదని.. చితకబాదిన టీచర్.. బాలుడి మృతి!

స్కూల్ ఫీజు చెల్లించలేదని ఓ టీచర్ విద్యార్థిని చితకబాదడంతో బాలుడు దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. పాఠశాల ఫీజు చెల్లించలేదని ఓ టీచర్ బాలుడ్ని చితకబాదడంతో అతడు మృతిచెందాడు. మంగళవారం జరిగిన ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో గల ఓ పాఠశాలలో జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. ఆరజ్(7) అనే బాలుడి తల్లిదండ్రులు పాఠశాలకు రూ.4,500 ఫీజు చెల్లించాల్సి ఉంది. ఫీజు వసూలు నిమిత్తం ఆగ్రహించిన పాఠశాల ఉపాధ్యాయుడు బాలుడిని తీవ్రంగా కొట్టారు. 
 
ఈ క్రమంలో బాలుడి తలపై బలంగా దెబ్బతగిలింది. దీంతో ఒక్కసారిగా బాలుడి ముక్కునుంచి రక్తం ధారగా ప్రవహించగా .. ఆరజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. చికిత్స నిమిత్తం బాలుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు బాలుడు మృతిచెందినట్లుగా నిర్ధారించారు.