శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 అక్టోబరు 2014 (14:43 IST)

ఫేస్ బుక్‌తో జాగ్రత్త: హుదూద్‌పై కామెంట్.. జైలుపాలు!!

అవునండి. ఫేస్ బుక్‌తో జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే. అనుచితంగా ప్రవర్తిస్తే మాత్రం జైలు తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాకాకుండా, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే కుదరదు.
 
అలా ఇష్టమొచ్చిన రీతిలో వ్యాఖ్యలు చేసినందుకు ఓ వ్యక్తి జైలుపాలవగా, అతను ఫేస్ బుక్‌లో చేసిన కామెంట్‌ను లైక్ చేసినవారు చిక్కుల్లో పడ్డారు. వారిపై కేసులు పెట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. 
 
వివరాల్లోకెళితే... ఆళ్ళగడ్డకు చెందిన రమణ అనే వ్యక్తి హుదూద్ తుపానుకు సంబంధించి ఫేస్ బుక్‌లో ఓ కామెంట్ చేశాడు. ఫలానా వ్యక్తిని గెలిపించనందునే విశాఖకు శాపం తగిలిందని, తుపాను సంభవించిందని పేర్కొన్నాడు.
 
దానిని ఓ 50 మంది వరకు లైక్, షేర్ చేశారు. కామెంట్ పెట్టిన రమణను అరెస్టు చేసిన పోలీసులు, దాన్ని లైక్ చేసిన, షేర్ చేసిన వ్యక్తుల ఆచూకీ తెలుసుకునే పనిలో పడ్డారు.