శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Modified: మంగళవారం, 3 మే 2016 (16:23 IST)

చిత్తూరు జిల్లాలో కోడలిని చంపేసిన మామ

పుట్టింటి తరువాత ఆడబిడ్డకు మెట్టిల్లే ఆలయమంటారు పెద్దలు. మెట్టినింటిలోని అత్త, మామలే కన్నతల్లిదండ్రులతో సమానమంటారు. అయితే అందుకు పూర్తి విరుద్ధంగా ప్రస్తుతం సమాజంలో కొన్ని సంఘనలు జరుగుతున్నాయి. కన్నబిడ్డలా చూసుకోవాల్సిన కోడలిని దారుణంగా కొట్టి చంపాడో మామ. చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టిస్తోంది.
 
పుంగనూరు భగత్‌సింగ్‌ కాలనీలో భాగ్యమ్మ, రాజశేఖర్‌లు నివాసముంటున్నారు. వీరితో పాటు రాజశేఖర్‌ మామ హరి కూడా ఉంటున్నారు. ఇంట్లో తరచూ మామ హరి కోడలికి పనిచెప్పేవారు. ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో గొడవలు జరుగుతుండేవి. మంగళవారం కూడా టిఫిన్‌ విషయంలో కోడలు, మామకు మధ్యకు గొడవ జరగడంతో ఆమె తీవ్రంగా కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. 
 
అంతటితో ఆగకుండా ఆమెను ఇంటిలోనే ఉరివేసి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులను నమ్మబలికే ప్రయత్నం చేశారు. అయితే స్థానికులు మాత్రం మామే కోడలిని చంపేశాడని ఫిర్యాదు చేశారు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.