శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Modified: శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (08:07 IST)

అమ్మాయిలు నేనంటే పడిచస్తారు... ఇది అబుసలేం ఆటో బయోగ్రఫీ

తానో పెద్ద గ్యాంగుస్టరు... ఆయన పేరు అబుసలేం.. ఇంతకంటే ఆయన గురించి వివరాలు అక్కరలేదు. ఎందుకంటే నేర ప్రపంచంలో ఆయన అందరికి పరిచయమే.. కానీ ఆయనంటే అమ్మాయిలు పడిచస్తారట. ఇంత కాలం మర్డర్లు, ధౌర్జన్యాలతో ఏ మాత్రం తిరిక లేకుండా కాలం గడిపిన గ్యాంస్టర్ అబు సలేం కొత్తగా తన ఆటో బయోగ్రఫీని రాస్తున్నారట. అందులో చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. తన వెంట పడే అమ్మాయిల నుంచి తాను వెంట పడిన అమ్మాయిల వరకూ అన్నీ రాసుకొచ్చారట. వివరాలిలా ఉన్నాయి. 
 
అబుసలేంకు ఇటీవలే కోర్టు యావజ్జీవకారాగార శిక్ష విధించింది. ఆయన ప్రపంచవ్యాప్తంగా నమోదైన 54 క్రిమినల్ కేసుల్లో నిందితుడు. అయినా ఆయనకు ఓ ఆత్మ ఉంది. దానికీ ఓ కథ ఉంది. అదే ఆయన ఆటోబయోగ్రఫీలో రాసుకున్నారు. అబూ సలేం ఆటోబయోగ్రఫీలో నుంచి 15 పేజీలని మెయిల్ టుడే చేజిక్కించుకుంది. మెయిల్ టుడే కథనం ప్రకారం... 
 
నర్గీస్ అనే ఓ అందమైన అమ్మాయి తరచూ తనని కలవాడినికి ముంబైలోని అంధేరీకి వచ్చేదట. ఒకవేళ తాను అక్కడ కనిపించకపోతే వెంటనే అక్బర్ అలీ ఆఫీస్‌కి వచ్చేదని అందులో వివరించాడు. ఆమె తనని ప్రేమించిందని... తాను మాత్రం ఆమెని ప్రేమించలేదని అబూ తన ఆటోబయోగ్రఫీలో రాసుకున్నాడు. తాను వుంటున్న బిల్డింగ్‌లోనే వున్న ఓ అమ్మాయి తనని ప్రేమించేదని.. తాను కూడా ఆమెని ఇష్టపడ్డానని కూడా రాసుకొచ్చాడీ గ్యాంగ్ స్టర్. త్వరలోనే అబుసలేం ఆటో బయోగ్రఫీ మార్కెట్లోకి విడుదల కానున్నది.