శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (18:37 IST)

తిరుపతి కోదండరామస్వామి ఆలయం డిప్యూటీ ఈవో ఇంట్లో సోదాలు.. అవినీతికి..?

తిరుపతిలోకి శ్రీ కోదండరామ స్వామి ఆలయం డిప్యూటీ ఈవోగా పనిచేస్తున్న భూపతిరెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు సమాచారం అందడంతో భూపతి రెడ్డి నివాసంతో పాటు బెంగళూరులోని ఆయన బంధువుల ఇళ్ళల్లోనూ సోదాలుజరుపుతున్నారు. ప్రస్తుతానికి భూపతిరెడ్డి పర్యవేక్షణలో 30 ఆలయాలున్నాయి. 
 
ఆలయ పర్యవేక్షణలో ఉండగా.. ఆయన అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. అంతేగాకుండా తిరుపతిలో నాలుగంతస్తున్న భవనం, రెండు లాకర్లు, 30కి మించిన ఇంటి స్థలాల డాక్యుమెంట్లు, తిరుచానూరులో లాడ్జి వంటివి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

అంతేగాకుండా 18 స్థలాలను అమ్మినట్టు కూడా అవినీతి నిరోధక శాఖాధికారులు నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఇవే గాకుండా ఈ దాడుల్లో ఆయన ఇంట్లో పలు కీలకమైన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.