శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 22 నవంబరు 2014 (17:38 IST)

మోడీకి నటుడు విజయ్ లేఖ.. థ్యాంక్స్!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి తమిళ నటుడు విజయ్ లేఖ రాశారు. శ్రీలంకలో ఉరిశిక్షపడ్డ తమిళనాడుకు చెందిన ఐదుగురు జాలర్ల అంశంలో జోక్యం చేసుకుని విడుదల చేయించిన మోడీకి విజయ్ లేఖా ముఖంగా కృతజ్ఞతలు తెలిపారు.
 
జాలర్లను వెనక్కు రప్పించేందుకు పీఎం చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. జాలర్లు సొంత రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా తమిళనాడు ఓ పండుగలా జరుపుకుందని విజయ్ పేర్కొన్నారు.