శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 19 మార్చి 2017 (12:39 IST)

యోగి ఆదిత్యనాథ్‌పై ఓవైసీ ఘాటు వ్యాఖ్య.. మోడీ ఇండియా విజన్‌లో భాగమే

యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ సీఎంగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌ను ఎన్నుకోవడం ప్రధాని మోడీ నూతన భారత విజన్‌లో భాగమని.. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముందంటూ ఏఐఎంఐఎం అధి

యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ సీఎంగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌ను ఎన్నుకోవడం ప్రధాని మోడీ నూతన భారత విజన్‌లో భాగమని.. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముందంటూ ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్ధీన్ ఓవైసీ ఒకింత ఘాటుగా స్పందించారు. ముస్లిం ఫైర్‌బ్రాండ్‌ నేతగా పేరొందిన ఒవైసీ మోడీ నిర్ణయాన్ని పరోక్షంగా ఎద్దేవా చేశారు. భారత అనాది హిందు, ముస్లిం సంస్కృతుల సమ్మేళనమైన 'గంగాయమున తెహజీబ్‌'పై ఇది దాడి చేయడమేనని తీవ్రంగా మండిపడ్డారు.
 
యోగి ఆదిత్యనాథ్ ఆదివారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు బీజేపీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఆదిత్యనాథ్ గణితశాస్త్రంలో గ్రాడ్యుయేట్. ఆ తర్వాత సన్యాసిగా మారారు.
 
ఇదిలా ఉంటే.. యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలకు మారు పేరు. గోరఖ్‌పూర్‌ నుంచి అయిదుసార్లు ఎన్నికైన ఎంపీగానే కాకుండా ఆ విధంగానూ ఆయనకు పేరొచ్చింది. లవ్‌ జిహాదీకి వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు, మత మార్పిడిలపై విరుచుకుపడుతూ చెప్పిన మాటలు చర్చనీయాంశమయ్యాయి.