మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2015 (13:05 IST)

అగ్రిగోల్డ్‌కు చెందిన 14 ఆస్తులు అమ్మేయండి : హైకోర్టు ఆదేశం

అగ్రిగోల్డ్ స్కామ్‌లో తీవ్రంగా నష్టపోయిన ఖాతాదారులకు హైకోర్టులో ఊరట లభించింది. అగ్రిగోల్డ్‌కు చెందిన మొత్తం ఆస్తుల్లో 14 ఆస్తులను అమ్మేయాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ సొమ్మును ఖాతాదారులకు చెల్లించాలని, ఒకవేళ ఆ సొమ్ము చాలకుంటే మిగిలిన ఆస్తులను కూడా విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది.
 
అగ్రిగోల్డ్ బాధితులు దాఖలు చేసుకున్న పిటీషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అగ్రిగోల్డ్ స్కాంలో మోసపోయిన ఖాతాదారులకు సోమ్ము తిరిగిచ్చేందుకు ఆ సంస్థ ఆస్తులు అమ్మాలని ఆదేశించింది. ఇందుకోసం అగ్రిగోల్డుకు చెందిన 14 ఆస్తులు అమ్మకానికి పెట్టాలని ఆదేశాలు ఇచ్చింది. వచ్చిన సొమ్మును హైకోర్టు పర్యవేక్షణ‌లో ఉంచాలని, మిగతా ఆస్తులను ఎవరికీ అమ్మవద్దని స్పష్టం చేసింది. అంతేగాక అగ్రిగోల్డ్ అనుంబంధ సంస్థలు, డైరెక్టర్లు, ఆడిటర్లను గుర్తించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.