మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (11:41 IST)

శశికళ బంధువు డాక్టర్ శివకుమార్.. జయకు తప్పుడు మందులు ఇచ్చాడు : సీహెచ్ పాండ్యన్

ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణానికి ముమ్మాటికీ శశికళ కారణమంటూ ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ సీహెచ్.పాండ్యన్ మరోమారు మరోమారు ఆరోపించారు. జయలలితకు వైద్యం చేసిన డాక్టర్లలో డాక్టర్ శివకుమార్ ఒకరని తెల

ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణానికి ముమ్మాటికీ శశికళ కారణమంటూ ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ సీహెచ్.పాండ్యన్ మరోమారు మరోమారు ఆరోపించారు. జయలలితకు వైద్యం చేసిన డాక్టర్లలో డాక్టర్ శివకుమార్ ఒకరని తెలిపారు. ఆయన జయలలితకు తప్పుడు మందులు ఇచ్చారని, ఈ కారణంగానే జయలలిత చనిపోయారంటూ ఆరోపించారు.
 
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై తిరుగుబాటు చేసిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు ఆయన బేషరతు మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత బుధవారం పన్నీర్ సెల్వంను స్వయంగా కలిసి మద్దతిస్తారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జయలలిత మరణంపై సంచలన ఆరోపణలు చేశారు. 
 
ఈయన మంగళవారం మాట్లాడుతూ... పోయెస్‌ గార్డెన్‌లో జయలలితతో ఘర్షణ పడ్డారని, ఆమెను ఎవరో తోసేయడంతో కిందపడిపోయారని అన్నారు. ఓ ఆర్డినెన్స్‌కు సంబంధించి వాదన జరుగుతున్న సమయంలో సెప్టెంబర్ 22వ తేదీన ఘర్షణ జరిగిందని అమ్మను కింద తోసేయడంతోనే ఆస్పత్రికి తరలించారని.. ఆమెకు ఇచ్చిన వైద్యం గురించి కూడా వివరాలు బయటికి పొక్కలేదన్నారు. అందుచేత జయలలిత మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని పాండ్యన్‌ డిమాండ్ చేశారు. శశికళకు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టే అర్హత లేదని ఆయన అన్నారు.