గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 27 జులై 2015 (11:02 IST)

అద్వానీపై కేసు ఉన్నా పద్మభూషణ్ ఇచ్చారు.. నాకు పాస్‌పోర్టు ఇస్తారా : అసదుద్దీన్ ఓవైసీ

భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీపై హైదరాబాద్ ఎంపీ, ఐఎంఐ అధినేత అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు చేశారు. అద్వానీపై బాబ్రీ మసీదు విధ్వంసం కేసు ఉందని, అలాంటి వ్యక్తికి పద్మ భూషణ్ ఇచ్చారన్నారు. అదే నాపై ఓ చిన్న కేసు ఉన్నా పాస్‌పోర్టు ఇచ్చేవారా? అని ప్రశ్నించారు. 
 
ఆయన సోమవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. ఒక భారతీయ పౌరుడిగా యాకూబ్ మెమన్‌కు న్యాయం జరగాలని మాత్రమే తాను కోరుకున్నట్టు చెప్పారు. మెమన్ స్థానంలో ఓ హిందువు ఉన్నా.. తాను ఇదే విధంగా స్పందిచేవాడినని గుర్తు చేశారు. యాకూబ్ మెమన్ ముస్లిం కావడం వల్లే ఉరిశిక్షను అమలు చేయబోతున్నారంటూ అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్న విషయంతెల్సిందే.
 
ఇకపోతే.. కొందరు కాంగ్రెస్ నేతలు తమను లక్ష్యంగా చేసుకుని అవాకులు చెవాకులు పేలుతున్నారన్నారు. అలాంటి వారే తమ మద్దతు కోరే రోజు తప్పక వస్తుందన్నారు. సాక్షాత్ ఇందిరా గాంధీనే హైదరాబాదులోని తమ కార్యాలయానికి వచ్చారని అసదుద్దీన్ గుర్తు చేశారు.