శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 25 సెప్టెంబరు 2016 (10:33 IST)

ఉద్యోగం పేరుతో యువతికి టోకరా.. ఎయిర్‌లైన్స్ కన్సల్టెన్సీ ఘరానా మోసం

కొన్ని కన్సల్టెన్సీ సంస్థలు నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని ఘరానా మోసాలకు పాల్పడుతున్నాయి. తాజాగా ఓ యువతిని ఎయిర్‌లైన్స్ కన్సల్టెన్సీ చేసిన మోసం బట్టబయలైంది. ఈ వివరాలను పరిశీలిస్తే...

కొన్ని కన్సల్టెన్సీ సంస్థలు నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని ఘరానా మోసాలకు పాల్పడుతున్నాయి. తాజాగా ఓ యువతిని ఎయిర్‌లైన్స్ కన్సల్టెన్సీ చేసిన మోసం బట్టబయలైంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బోయిన్‌పల్లికి చెందిన హనీరెడ్డి అనే విద్యార్థిని ఉద్యోగం కోసం ఆన్‌లైన్‌ శోధిస్తూ వచ్చింది. ఈ తరుణంలో ఆమెకు ఒక మెయిల్‌ ద్వారా 'ఉద్యోగం ఇప్పిస్తాం... అందుకు 15వేల రూపాయలు తమ అకౌంట్‌లోకి పంపించాలి' అని ఓ ఎయిర్‌లైన్స్‌ కన్సల్టెన్సీ నుంచి సమాచారం వచ్చింది. 
 
అందుకు సంతోసించిన హనీరెడ్డి వారు పంపించిన అకౌంట్‌ నెం.201000198272కు 15 వేల రూపాయలు పంపించింది. డబ్బును బ్యాంకు ఖాతాలో వేసి 15 రోజులు గడిచినా కన్సల్టెన్సీ నిర్వాహకుల నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో వారు ఇచ్చిన నెంబర్‌కు ఫోన్‌ చేయగా వారు తమకు ఎలాంటి సంబంధమూ లేదని చెప్పడంతో ఖంగుతిన్న బాధితురాలు బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.