Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మక్కామసీదు పేలుళ్ల కేసు కొట్టివేత.. ఆ ఐదుగురు నిర్దోషులే

సోమవారం, 16 ఏప్రియల్ 2018 (13:05 IST)

Widgets Magazine

11 సంవత్సరాల నాటి మక్కామసీదు పేలుళ్ల కేసును కొట్టివేస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. 2007 మే 18న మక్కా మసీదులో బాంబు పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పేలుళ్ల కేసును విచారించిన కోర్టు ఐదుగురు నిందితులను నిర్దోషులుగా కోర్టు తేల్చేసింది. 
 
పేలుళ్ల కేసులో నిందితులపై నేరారోపణలు నిరూపించేందుకు ప్రాసిక్యూషన్ విఫలమైంది. దాంతో ఐదుగురు నిందితులు అసిమానంద, భరత్, దేవేందర్‌గుప్తా, రాజేందర్, లోకేశ్ శర్మలను కోర్టు నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. ఆపై రెండు నిమిషాల్లోనే ఎన్ఐఎ కోర్టు మక్కా మసీదు కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.  
 
మక్కామసీద్ కేసులో నిందితుల్లో ఏ ఒక్కరిపైనా అభియోగాలు రుజువు కాలేదని న్యాయవాది ఒకరు తెలిపారు. కోర్టుకు హాజరైన ఆ ఐదుగురు నిందితులపై విచారించిన న్యాయస్థానం కేసును కొట్టివేసినట్టు మీడియాకు తెలిపారు. 
 
కానీ ఈ కేసులో మిగతా నిందితులపై చార్జ్‌షీట్ కొనసాగుతున్నట్టు తెలిపారు. పదకొండేళ్ల క్రితం శుక్రవారం ప్రార్థనల సందర్భంగా మక్కా మసీదులో పేలుళ్లు జరిగాయి. ఈ కేసులో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి గాయాలైన సంగతి తెలిసిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తండ్రి పదే పదే చెప్పుతో కొట్టాడు.. ఆ బాధ తట్టుకోలేక బాలిక ఏం చేసిందంటే?

కారణం ఏంటో తెలియరాలేదు కానీ తండ్రి పెడుతున్న హింసను తట్టుకోలేని ఓ బాలిక టెర్రస్ నుంచి ...

news

ఒబామా-మానుషి చిల్లార్‌ను కలిస్తే రాయరు.. ఫేక్ న్యూస్‌ కోసం?: పూనమ్ కౌర్

మీడియాపై సినీ నటి పూనమ్ కౌర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియా ఎప్పుడూ టీఆర్పీ రేటింగ్ ...

news

ప్రజాప్రతినిధుల్లోనూ రేపిస్టులు.. బీజేపీకి చెందినవారే అత్యధికం?

ప్రజాప్రతినిధుల్లో రేపిస్టులు వున్నారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ...

news

పవన్‌కు ప్యాకేజీ ఇస్తే చాలు.. మసాజ్ చేసేందుకు బెంగాలీ అమ్మాయిలు కావాలి..

టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌ పెను సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి ...

Widgets Magazine