శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PY REDDY
Last Modified: గురువారం, 18 డిశెంబరు 2014 (12:30 IST)

మాజీ ఎమ్మెల్యే విష్ణు అరెస్టుకు రంగం సిద్ధం

పెళ్ళిలో జరిగిన ఘర్షణ కేసులో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన రెడ్డి అరెస్టు వరకూ వచ్చింది. ఆయనను అరెస్టు చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. గతవారం ఓ పెళ్ళి కార్యక్రమంలో విష్ణువర్థన్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డిలు ఘర్షణకు దిగిన విషయం తెలిసింది. ఆ ఘర్షణలో వంశీ స్వల్పంగా గాయపడ్డాడు. ఘర్షణ తరువాత ఇద్దరూ హైదరాబాద్ మాదాపూర్ పోలీసు స్టేషన్ లో పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. 
 
ఇందులో భాగంగా పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలించారు. ఈ పుటేజ్ లో వంశీపై విష్ణు దాడి చేస్తున్న వారికి ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ఇందులో ఇద్దరికీ మధ్యలో వచ్చిన గన్ మెన్ ను విష్ణు ముఖంపై గుద్దుతున్నట్లు రికార్డు అయ్యింది. అదే సమయంలో ఇద్దరు నాయకులు తోపులాడుకున్నట్లు కూడా నమోదయ్యింది. వీటిని ఆధారం చేసుకుని పోలీసులు విష్ణును అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.