శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 22 అక్టోబరు 2014 (18:48 IST)

ఆళ్లగడ్డలో 4 నామినేషన్లు తిరస్కరణ : పోలింగ్ తప్పదా?

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఉప ఎన్నికల కోసం దాఖలు చేసిన నామినేషన్లలో నాలుగింటిన రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. స్వతంత్ర  అభ్యర్థులు చాకలి పుల్లయ్య, విజయలక్ష్మి, బోయ చంటి, నాగమౌనిక రెడ్డి అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. 
 
కాగా, ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొత్తం ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ నామినేషన్ దాఖలు చేయగా.. ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో నాలుగు నామినేషన్లను తిరస్కరించారు. 
 
మరో మూడు నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయి. వీటిలో రెండు స్వతంత్ర అభ్యర్థులవి కాగా, ఒకటి వైకాపా అభ్యర్థి భూమా అఖిలప్రియా రెడ్డిది. దీంతో అఖిల ప్రియా రెడ్డి ఏకగ్రీవ ఎన్నికపై సందేహం నెలకొంది. కాగా, ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, ఎంఐఎం పార్టీలు పోటీ చేయరాదని నిర్ణయించిన విషయం తెల్సిందే.