బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (14:47 IST)

అమరావతికి 'స్పా' : విద్యార్థులతో ఆర్కిటెక్ట్ నమూనాలు!

నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై అన్ని విభాగాల వారు దృష్టిసారించారు. రాజధాని భవనాలు, నిర్మాణాల కోసం ఆర్కిటెక్ట్ కళాశాలలకు చెందిన ప్రొఫెసర్లు, విద్యార్థులు నమూనాలు తయారు చేస్తున్నారు. పరిశోధనా పత్రాల ఆధారంగా సీఆర్డీఏ రంగంలోకి దిగనుంది. 
 
సింగపూర్ ప్రభుత్వం ఇచ్చే మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా రాజధాని నిర్మాణం మొత్తంగా ఏ విధంగా ఉండాలన్న దానిపై స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (స్పా) విద్యార్థులు, ప్రొఫెసర్లు పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనా ఫలితాలను దృష్టిలో ఉంచుకుని సీఆర్డీయే కార్యరంగంలోకి దిగుతుంది. 
 
సింగపూర్ ప్రభుత్వం ప్రస్తుతం తొలి దశ మాస్టర్ ప్లాన్ మాత్రమే ఇచ్చింది. మరో నెలన్నర తర్వాత తుది దశ ప్లాన్‌ను అందజేయనుంది. ఈ మాస్టర్ ప్లాన్ వచ్చాక స్పా కళాశాల సమగ్ర అధ్యయనం చేయనుంది. ఈ అధ్యయనం కాలేజీ ప్రొఫెసర్లు, విద్యార్థులు రంగంలోకి దిగనున్నారు. ఈ విద్యార్థులు ఇచ్చే ఆర్కిటెక్ట్‌లతో పాటు.. సింగ పూర్ ప్రభుత్వ కలిసి అనేక ప్రణాళికలు రూపొందిస్తారు.
 
ఇందులో అసెంబ్లీ, సచివాలయం మొదలు ప్రధానమైన భాగాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో సూచన చేస్తుంది. అలాగే, రాజధానిలో ఒక ఎయిర్‌పోర్టు నిర్మాణం కూడా ఉంది. తొలి దశ మాస్టర్ ప్లాన్‌లో ఎయిర్‌పోర్టుతో పాటు.. రైల్, రోడ్డు కారిడార్‌లను కూడా నిర్ధేశించారు. అయితే, అసెంబ్లీ, సచివాలయం, కోర్ కాపిటల్ నిర్మాణం ఏ విధంగా జరగాలన్న అంశంపై స్పా విద్యార్థులు పరిశోధనా పత్రాలను సమర్పించనున్నారు.