Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫిబ్రవరి 1 నుంచి ఏపీలో నూతన భూమార్పిడి సవరణ చట్టం... ఏం జరుగుతుంది?

గురువారం, 25 జనవరి 2018 (20:39 IST)

Widgets Magazine
Amaravati

వచ్చే నెల ఫిబ్రవరి 1వ తేది నుంచి నూతన నాలా సవరణ చట్టం అమల్లోకి వస్తుంది. ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ సవరణ చట్టం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా భూమార్పిడి ఫీజులు భారీగా తగ్గుతాయన్నారు ఉపముఖ్యమంత్రి కే.ఈ క్రిష్ణమూర్తి. విజయవాడ, విశాఖ నగరాల్లో ప్రస్తుతం ఉన్న 5 శాతం ఉన్న ఫీజు 2 శాతానికి తగ్గుతుంది. అలాగే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో 9 శాతంగా ఉన్న ఫీజు 3 శాతానికి తగ్గుతుందన్నారు. 
 
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన వేగం పుంజుకుంటాయని తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో విద్య, వైద్య మరియు పారిశ్రామికపరంగా ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను తీసుకువచ్చింది. భూమార్పిడి ఫీజు తగ్గించడంతో పాటు పరిశ్రమలు ఏర్పాటు అనుతులు వేగవంతం చేసేందుకు నాలా చట్టంలో మార్పులు ఉపయోగపడతాయన్నారు.
 
సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత ఫీజు చెల్లించిన వెంటనే భూమార్పిడి వర్తిస్తుంది. అనుమతులు కోసం ఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, అలాగే పరిశ్రమల ఏర్పాటు కొరకు APIIC ద్వారా భూమిని పొందినవారు ఎలాంటి భూమార్పిడి రుసుమును చెల్లించాల్పిన అవసరం ఉండదు. వచ్చే నెల ఫిబ్రవరి 1వ తేది నుంచి సవరించిన భూమార్పిడి ఫీజులు అమలులోకి వస్తాయని ఉపముఖ్యమంత్రి  కే.ఈ క్రిష్ణమూర్తి తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రెండు పులులు చుట్టుముట్టాయి.. బైకుపై ఇద్దరు వ్యక్తులు ఏం చేశారో తెలుసా? (వీడియో)

పులిని చూస్తే మీరేం చేస్తారు..? ఇంకా రెండు పులులు కనిపిస్తే.. భయంతో పరుగులు తీయరూ..? కానీ ...

news

కత్తి మహేష్‌ తిరుపతి ఎంపీ సీటుకు పోటీ చేస్తారా? అదీ జనసేన పార్టీ ఇస్తుందా?

ఇలాంటి పుకార్లు ఎలా పుడతాయో తెలియదు కానీ భలేగా లాగించేస్తుంటారు. ఇటీవలి కాలంలో కత్తి ...

news

నాన్నా ఎందుకలా చేశారు? మోహన్ బాబుతో మంచులక్ష్మి...

నాన్నా.. ఒక టివి ఛానల్ ఇంటర్వ్యూలో ఎందుకు అలా మాట్లాడారు. మీరు అలా మాట్లాడినందుకు మన మంచు ...

news

వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ ఘన విజయం: శైలజానాథ్ - ఫక్కున నవ్విన శ్రీవారి భక్తులు

తిరుమల శ్రీవారిని కాంగ్రెస్ నేత శైలజానాథ్ దర్శించుకున్నారు. ఆలయం వెలుపల శైలజానాథ్ ...

Widgets Magazine