Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాబూ.. హరిబాబు.. ఎపిలో మనం గెలిచే అవకాశం ఉందా? అమిత్ షాకు ఎంత ధైర్యమో?

శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (22:01 IST)

Widgets Magazine
modi - shah

ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ నాయకులు సమావేశం ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారుతోంది. ఎపితో పాటు తెలంగాణా రాష్ట్రాలకు చెందిన బిజెపి అగ్రనాయకులతో అమిత్ షా సమావేశం అయిన విషయం తెలిసిందే. తెలంగాణా రాష్ట్రంతో పాటు ఎపిలోను పాగా వేయాలన్న ఆలోచనలో ఇప్పటికే అమిత్ షా ఉన్న విషయం తెలిసిందే. ముందుగా తెలంగాణా రాష్ట్రంలో పర్యటించి అక్కడ పరిస్థితులను తెలుసుకున్నారు అమిత్ షా. సభకు జనాన్ని బిజెపి నాయకులు తీసుకొచ్చారు కానీ ప్రజల్లో బిజెపిని తీసుకెళ్ళలేకపోయారన్న నిర్ణయానికి వచ్చేశారు అమిత్ షా. అందుకే మెల్లమెల్లగా నాయకులను జనాల్లోకి వెళ్ళాలని ఆదేశాలిచ్చారు. 
 
కానీ ఇప్పుడు తెలంగాణా కన్నా ఎపిపైనే ఎక్కువగా అమిత్ షా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. నిన్న ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఎపి బిజెపి అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుతో చాలాసేపు అమిత్ షా చర్చించినట్లు తెలుస్తోంది. బాబూ.. హరిబాబు.. వచ్చే ఎన్నికల్లో మనం స్వతంత్రంగా నిలబడితే గెలుస్తామా అంటూ ఆయన్ను ప్రశ్నించారట అమిత్ షా. దీంతో ఒక్కసారిగా ఏం చెప్పాలో తెలియక హరిబాబు తికమకపడ్డారట. సొంతంగా అన్ని నియోజకవర్గాల్లో మనం నిలబడడం ఏంటన్నది హరిబాబు ఆలోచన. 
 
తెలుసుకుందామని మాత్రమే నేను అడిగాను.. మీరంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. తెలిసినంత వరకు మాత్రమే చెప్పండంటూ అమిత్ షా అడిగారట. సర్.. మనకు ఎపిలో పట్టైతే ఉంది. కానీ ప్రజల్లోకి మరింతగా మన పథకాలు వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పారట. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం మనకు ఉంది. అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళండి అంటూ అమిత్ షా ఎపిలోని బిజెపి నాయకులకు దిశానిర్దేశం చేశారట. ఇప్పటికే మిత్రపక్షమైన టిడిపితో దూరమవుతున్న బిజెపి వచ్చే ఎన్నికల్లో సొంతంగా ఎపిలో పోటీ చేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే నియోజకవర్గాలన్నింటిలో కాకుండా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తమ సత్తాను బిజెపి చూపించే అవకాశం లేకపోలేదంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కర్నాటకలో 'పందెం కోళ్లు'లా మెగా బ్రదర్స్... ఏంటి సంగతి?

మెగాస్టార్, పవర్ స్టార్ ఇద్దరూ ఎడమొహం, పెడ మొహం అందరూ అనుకుంటారు. కానీ చిరంజీవి, పవన్ ...

news

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం.. ఆ పార్టీ నుంచే అంటోన్న కలెక్షన్ కింగ్

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఈయన ఎక్కడ మాట్లాడినా అది సెన్సేషనలే. అదిరిపోయే డైలాగ్‌లతో ...

news

వృద్ధులు, పెద్దవాళ్లు పనికిరానివాళ్లా? ఐతే ఇక్కడ చూడండి...

ఈ ఆధునిక ప్రపంచంలో ఉమ్మడి కుటుంబం అనేది చాలా అరుదుగా కనపడుతుంది. ఉమ్మడి కుటుంబము అనగానే ...

news

బీజేపీతో ఇంకా అంటకాగితే చిత్తుగా ఓడిస్తారు : చంద్రబాబుతో నేతలు

ఇప్పటికీ మునిగిపోయిందీ లేదు.. బీజేపీతో ఉన్న స్నేహ బంధానికి కటీఫ్ చెప్పేద్ధాం. లేకుంటే ...

Widgets Magazine