Widgets Magazine

కలెక్టర్ అమ్రపాలి హనీమూన్ ఎక్కడో తెలుసా?

వరంగల్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి కాటా వివాహం ఈనెల 18వ తేదీన జరుగనుంది. ఢిల్లీకి చెందిన ఐపీఎస్ అధికారి సమీర్ శర్మతో ఈమె వివాహం జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో జరుగనుంది. వివాహం తర్వాత ఈ దంపతులు ఈనెల 21వ తేదీ వ

amrapali
pnr| Last Updated: గురువారం, 15 ఫిబ్రవరి 2018 (11:12 IST)
వరంగల్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి కాటా వివాహం ఈనెల 18వ తేదీన జరుగనుంది. ఢిల్లీకి చెందిన ఐపీఎస్ అధికారి సమీర్ శర్మతో ఈమె వివాహం జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో జరుగనుంది. వివాహం తర్వాత ఈ దంపతులు ఈనెల 21వ తేదీ వరకు అక్కడే ఉండనున్నారు.
ఆ తర్వాత 22వ తేదీన హైదరాబాద్, 26న వరంగల్‌లో వీరు వివాహం విందు ఇవ్వనున్నారు. ఈ తర్వాత హానీమూన్ కోసం టర్కీ వెళ్లనున్నారు. ఇక్కడే మార్చి 7వ తేదీ వరకు ఉంటారు. 9వ తేదీన తిరిగి విధుల్లో చేరుతారు.

మరోవైపు, అమ్రపాలి తన వివాహం కోసం గురువారం నుంచి వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకు సెలవుపై వెళ్లనున్నారు. దీంతో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్, రూరల్ జిల్లాకు ఇన్ చార్జ్ బాధ్యతలను వరంగల్ అర్బన్ జాయింట్ కలెక్టర్‌కే అప్పగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక ఇప్పటికే వరంగల్ రూరల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లు బదిలీ అయిన తరువాత ఇన్ చార్జ్ ల ఆధ్వర్యంలో పాలన సాగుతుండగా, ఇప్పుడు మరో జిల్లా కూడా వచ్చి చేరింది. మొత్తం ఐదు జిల్లాలకు ఇన్ చార్జ్‌లే కొనసాగనుండటం గమనార్హం.


దీనిపై మరింత చదవండి :