ఎలుకల కోసం తవ్వితే.. పాము కాటేసింది..

Last Updated: శనివారం, 8 డిశెంబరు 2018 (11:50 IST)
ఎలుకలను పట్టేందుకు పుట్టను తవ్వితే.. పాము కాటేసింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళతే చౌడేపల్లె మండలం, పందిళ్లపల్లె సమీపంలోని దామరకుంటకు చెందిన సిద్ధప్ప కుమారుడు పెద్దబ్బోడు (28) కూలి పనులు చేస్తుంటాడు. ఎలుకలను పట్టడం.. అడవి దినుసులు సేకరించి అమ్మడం ఇతడి పని. 
 
ఇలా శుక్రవారం చుక్కావారిపల్లె సమీపంలోని పొలాల్లో ఎలుకలు పట్టేందుకు ఒప్పుకుని వెళ్లిన అతను.. ఓ పుట్టను తవ్వాడు. అందులో నుంచి బయటకు వచ్చిన పాము కాటేసింది. ఆపై నాటు వైద్యానికి తరలించినా లాభం లేకపోయింది. పెద్దబ్బోడు ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై మరింత చదవండి :