Widgets Magazine

'నా కోరిక తీర్చితే మీకు పీహెచ్‌డీలు ఇప్పిస్తా' : జేఎన్‌టీయూ ప్రొఫెసర్ వేధింపులు

శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (17:05 IST)

harassment

విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ ప్రొఫెసర్ బుద్ధి వక్రమార్గంలో పయనించింది. ఫలితంగా తన వద్ద చదువుకునే విద్యార్థినులను లైంగికంగా వేధించడమే కాకుండా, ఏకంగా తన కోర్కెలు తీర్చితే పీహెచ్‌డీ డిగ్రీ వచ్చేలా చేస్తానంటూ ఆఫర్ చేశాడు. ఇపుడు ఆ కీచక విద్యార్థి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఉన్నత విద్యా సంస్థల్లో ఒకటిగా పేరుగడించిన కాకినాడ జేఎన్‌టీయూ యూనివర్శిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
కాకినాడ జేఎన్టీయూ క్యాంపస్‌లో కె.బాబులు అనే వ్యక్తి ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. ఇక్కడ ఎంటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినులను లైంగికంగా వేధించసాగాడు. ముఖ్యంగా, వైవా సమయంలో తన గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, తాకరానిచోట తాకుతూ వ్యక్తిగత విషయాలను సేకరిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. విద్యార్థినుల వద్ద రహస్యంగా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. 
 
సాధారణంగా వైవా పరీక్షలు అసిస్టెంట్‌, సీనియర్‌ ప్రొఫెసర్‌, ల్యాబ్ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌ల సమక్షంలో నిర్వహించాల్సి ఉండగా కొందరికి ల్యాబ్‌లో నిర్వహించిన ప్రొఫెసర్‌ కె.బాబులు తన వ్యక్తిగత గదిలో కొందరు విద్యార్థినిలకు వైవా నిర్వహించినట్టు తేలింది. మొత్తం 23 మందిని విచారించగా వారికి జరిగిన అన్యాయాన్ని కూలంకషంగా వివరించారని, వ్యక్తిగతంగా కలవమని చెబుతూ మరో పక్క వ్యక్తిగత విషయాలు అడుగుతూ అసందర్భంగా తాకుతూ లైంగికంగా, శారీరకంగా అవమానపరిచి, మాటలు, చేతలతో వేధించి మానసిక వేదనకుగురిచేశాడు. ఈ విచారణ అనంతరం ప్రొఫెసర్‌ కె.బాబులును రాజమహేంద్రవరంలో జనవరి 31వ తేదీన అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్‌ విధించారన్నారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
Professor Harassment Jntu Kakinada Andhra Police Arrest

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఇందిరమ్మ ఇల్లుంది బేటా.. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ వద్దు...

తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఓ మహిళ తేరుకోలేని షాకిచ్చింది. "నాకు ఇందిరమ్మ ఇల్లుంది బేటా.. ...

news

చంద్రబాబు "భోజనం ఫోన్‌కాల్‌"పై టీడీపీ నేతల్లో వణుకు

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలకు మరో యేడాది మాత్రమే సమయం ఉంది. దీంతో ...

news

ఫేస్ బుక్ ఫ్రెండ్... 'పద్మావతి'ని చూపిస్తానని థియేటర్లోనే రేప్ చేశాడు...

ఫేస్ బుక్ అడ్డంపెట్టుకుని స్నేహం పేరుతో దగ్గరై మోసం చేస్తున్నవారి సంఖ్య పెరుగుతూనే వుంది. ...

news

జగన్ సొల్లు కామెంట్స్ ... బీజేపీకి మెజార్టీ ఉందన్న పొగరు : టీజీ ఫైర్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీ ఉందన్న పొగరుతో ...

Widgets Magazine