శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 27 నవంబరు 2014 (09:56 IST)

చంద్రబాబు జపాన్ పర్యటన తొలి ఫలం : ఇసుజు పికప్ ట్రక్కుల ఫ్యాక్టరీ!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యంమత్రి నారా చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటన ముగియకముందే సత్ఫలితాలనిస్తోంది. ఇందులోభాగంగా.. ఆటోమొబైల్ రంగంలో ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీగా పేరొందిన ఇసుజు కంపెనీ పికప్ ట్రక్కుల కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. 
 
చంద్రబాబు తన వెంట తీసుకెళ్లిన ప్రతినిధి బృందంతో కలిసి గత నాలుగు రోజులుగా జపాన్‌లో పర్యటిస్తున్న విషయం తెల్సిందే. ఈ పర్యటనలో భాగంగా జపాన్‌లోని పలు నగరాల్లో పర్యటిస్తున్నారు. అలాగే, ఆటోమొబైల్ రంగంలో ప్రపంచంలోనే పేరొందిన ఇసుజు కంపెనీ ప్రతినిధులతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం ప్రతిపాదనలకు ముగ్ధులైన ఆ కంపెనీ ప్రతినిధులు, ఏపీలో పికప్ ట్రక్కుల కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
 
ఇక తన పర్యటనలో భాగంగా గురువారం జపాన్ ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలతో చంద్రబాబు పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఇంకా రెండు రోజుల పర్యటన మిగిలి ఉన్న నేపథ్యంలో మరిన్ని కంపెనీలతో భేటీ కానున్న సీఎం, మరిన్ని ఒప్పందాలను సాధిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి.