గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PY REDDY
Last Updated : శనివారం, 20 డిశెంబరు 2014 (18:02 IST)

ఈ పాలన షురూ.. కార్యాలయం ప్రారంభించిన చంద్రబాబు

పాలనలో తనదైన ముద్ర వేసుకోవడానికి చంద్రబాబు ఎప్పుడూ ముందే ఉంటారు. నిన్నటికి నిన్న కాబినెట్ సమావేశాన్ని పేపర్ లెస్ గా నిర్వహించిన ఆయన శనివారం ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. సిఎంఓను పూర్తిగా పేపర్ లెస్ గా తయారు చేశారు. మొదటి దశలో భాగంగా చీఫ్ సెక్రటరీ కార్యాలయం, సిఎంవోలు పూర్తిగా కంప్యూటర్ల మీదనే నడుస్తాయి. 
 
అన్ని ఫైళ్ళను కంప్యూటర్ల ద్వారానే తెప్పించుకుని క్లియర్ చేస్తారు. జాప్యాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆఫీస్ ప్రాజెక్టు ద్వారా అన్ని ఫైళ్ళను డిజిటలైజ్ చేస్తారు. ఏ స్థాయిలో ఫైలు క్లియరవుతుందో ఆ స్థాయిలోని అధికారి కంప్యూటర్లోనే ముందుకు పంపాల్సి ఉంటుంది. 
 
లేదంటే తిరస్కరిస్తున్నట్లు ఫీడ్ చేయాలి. ఇలాంటి ఆప్షన్లున్న సాఫ్ట్ వేర్ తయారు చేస్తారు. ఇందులోనే అన్ని ఫైళ్ళు నడుస్తాయి. ప్రస్తుతానికి సిఎంఓ, చీఫ్ సెక్రటరీ కార్యాలయాలను డిజిటలైజ్ చేస్తారు. అనంతరం రెండో దశలో అన్ని కార్యాలయాలను ఈ కార్యాలయాలుగా మార్చుతారు.