శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 2 జూన్ 2017 (11:30 IST)

రాష్ట్రానికి అన్యాయం జరిగిన రోజును మరిచిపోకూడదు.. అదో చీకటి రోజు: చంద్రబాబు

రాష్ట్రానికి ఎంతో అన్యాయం జరిగిన జూన్ 2వ తేదీని ఎవరూ మరిచిపోకూడదని కాబట్టే.. తానిలా చేయాల్సి వచ్చిందని.. మండుతున్న ఎండల్లో సైతం నవ నిర్మాణ దీక్ష పేరిట తాను ప్రజలను కష్టపెట్టాల్సి వస్తోందని ఏపీ సీఎం చం

రాష్ట్రానికి ఎంతో అన్యాయం జరిగిన జూన్ 2వ తేదీని ఎవరూ మరిచిపోకూడదని కాబట్టే.. తానిలా చేయాల్సి వచ్చిందని.. మండుతున్న ఎండల్లో సైతం నవ నిర్మాణ దీక్ష పేరిట తాను ప్రజలను కష్టపెట్టాల్సి వస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఉదయం విజయవాడ బెంజ్ సర్కిల్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. 
 
రాష్ట్ర నిర్మాణం కోసం పునరంకింతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ప్రజల కష్టాన్ని తాను అర్థం చేసుకోగలుగుతానని చంద్రబాబు నాయుడు తెలిపారు. అన్యాయం జరిగిందని ఇళ్లలో పడుకుని సాధించేది ఏమీ లేదని, బయటకు వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత జపాన్ వాసులు చూపిన స్ఫూర్తి, ఆ దేశాన్ని అగ్రదేశాల్లో ఒకటిగా నిలిపిందని, అలాగే నవ్యాంధ్ర ప్రజలూ ముందడుగు వేయాలని కోరారు. రాష్ట్ర చరిత్రలో ఇదో చీకటి రోజని తెలిపారు. 
 
రాష్ట్రాలూ అవతరణ దినోత్సవాలను జరుపుకుంటాయని.. అదే సమయంలో మనం మాత్రం నవనిర్మాణ దీక్ష చేసి రాష్ట్రావతరణ సందర్భంగా జరిగిన రాష్ట్రాలూ అవతరణ దినోత్సవాలు జరుపుకుంటాయని బాబు చెప్పారు.