గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 17 డిశెంబరు 2014 (18:13 IST)

ఏపీ సర్కారుకు లోకాయుక్త నోటీసులు: టి.తో విద్యుత్ ఒప్పందాలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. తెలంగాణతో కుదుర్చుకోవాల్సిన విద్యుత్ ఒప్పందాలను ఏపీ సర్కారు రద్దు చేసుకున్న నేపథ్యంలో.. ఒప్పందాల రద్దుకు కారణం వివరించాలని లోకాయుక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
 
పిపిఎ ఒప్పందాల రద్దు ఎందుకు చేయాల్సి వచ్చిందో జనవరి 19వ తేదీలోగా వివరణ ఇవ్వాలని లోకాయుక్త ఆదేశించింది. అయితే పిపిఎల రద్దు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టి పట్టుదల మీద వుంది. పిపిఎల రద్దు విషయంలో తనకు పూర్తి హక్కులు వున్నాయన్న వాదనను లోకాయుక్త ముందు వినిపించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 
 
విద్యుత్ విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదాలు నెలకొన్న నేపథ్యంలో పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించి తెలంగాణకు రావాల్సిన విద్యుత్‌ను ఏపీ సర్కారు అడ్డుకుంటోందని తెలంగాణ సర్కారు విమర్శిస్తోంది.