బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 3 సెప్టెంబరు 2014 (11:54 IST)

ఏపీ రాజధాని సిటీ వరకు తారక రామ నగర్ పేరు పెడతారా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధానిగా ఏర్పాటు చేసే ప్రాంతానికి తారక రామ నగర్‌ పేరును పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. రాజధానిగా ఎంపిక చేసే ప్రాంతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం 12 గంటల 17 నిమిషాలకు అసెంబ్లీలో ప్రకటించనున్నారు. దీంతో రాజధానిపై ఉన్న ఉత్కంఠతకు తెరపడనుంది. 
 
అదేసమయంలో ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధానికి తెలుగువారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన నందమూరి తారక రామారావు పేరు పెట్టాలన్న అభిప్రాయాలు జోరుగా వస్తున్నాయి. రాష్ట్ర మంత్రి పత్తిపాటి పుల్లారావు రాజధానికి ఎన్టీఆర్ పేరు పెడితే 8 వేల ఎకరాల భూమి ఇవ్వడానికి గుంటూరు జిల్లాలో రైతులు సిద్ధంగా ఉన్నారంటూ ప్రకటించారు. 
 
ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజధానికి ‘తారకరామ నగర్’గా పేరు పెట్టాలన్న ప్రతిపాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే, ఈ పేరును రాజధాని మొత్తానికీ కాకుండా, రాజధానిలో అసెంబ్లీ, సచివాలయం, రాజ్‌భవన్ వంటి ప్రభుత్వ ప్రధాన నిర్మాణాలున్న ప్రాంతానికి ‘తారకరామ నగర్’ అనే పేరు పెట్టాలన్న తలంపులో ఉన్నారు.