శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 26 అక్టోబరు 2014 (11:11 IST)

నవ్యాంధ్ర ప్రదేశ్ కొత్త రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలం!

నవ్యాంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని నిర్మించే ప్రాంతంగా తుళ్లూరు మండలాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారు. గుంటూరు జిల్లా తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని తుళ్లూరు మండల పరిధిలోనే కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలని శనివారం పార్టీ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 
 
తుళ్లూరుకు కేవలం ఐదు కిలో మీటర్ల దూరంలోనే కృష్ణా నది ప్రవహిస్తోంది. ఇక అమరావతికి 20 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రదేశం వుంది. విజయవాడకు 25 కిలోమీటర్లు, గుంటూరుకు 33 కిలోమీటర్ల దూరంలో తుళ్లూరు ఉందని ఆయన గుర్తు చేశారు. అలాగే, జాతీయ రహదారిపై ఉన్న మంగళగిరికి ఇది కేవలం 20 కిలో మీటర్ల దూరంలోనే ఉందన్నారు. 
 
ఎటు చూసినా అన్ని రకాలుగా తుళ్లూరు మండలమే కొత్త రాజధానికి అనువుగా ఉందని చంద్రబాబు ప్రభుత్వం అభిప్రాయడింది. రాజధాని నిర్మాణానికి తొలిదశలో ఈ మండలంతో పాటు.. వీజీటీఎంలో 30 వేల ఎకరాల భూమిని సేకరించాలని భావిస్తున్నారు. ఆ దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.