Widgets Magazine Widgets Magazine

నా పీఏను తక్షణం తొలగించండి.. చంద్రబాబును కోరిన బాలకృష్ణ

మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (12:41 IST)

Widgets Magazine
balakrishna - sekhar

హిందూపురంలో టీడీపీ శ్రేణులను ఓ ఆట ఆడుకుంటున్న పీఏ శేఖర్‌ను తక్షణం తొలగించాలని సినీ నటుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కోరారు. ఈ మేరకు ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ప్రత్యేకంగా సమావేశమై విజ్ఞప్తి చేశారు. హిందూపురం పార్టీలో తలెత్తిన లుకలుకలకు కారణమైన శేఖర్‌ను ఇక కొనసాగించరాదని, పార్టీలో క్రమశిక్షణను ఎవరు ఉల్లంఘించినా సహించేది లేదని, ఎవరి ఒత్తిళ్ళకూ తలొగ్గరాదని స్పష్టం చేశారు. 
 
కాగా, హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ సినీ షూటింగ్‌లలో బిజీగా ఉండటంతో స్థానిక రాజకీయ పరిస్థితులను పీఏ శేఖర్ గత రెండున్నరేళ్లుగా చక్కబెడుతున్నారు. ఈ క్రమంలో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నాడని, కాంట్రాక్టర్లను బూతులు తిడుతూ బెదిరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, పార్టీ నేత అంబికా లక్ష్మీ నారాయణ పార్టీ నాయకత్వ దృష్టికి తెచ్చారు. పైగా, శేఖర్‌ను తొలగించకపోతే రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. 
 
అదేసమయంలో లేపాక్షి, చిలమత్తూరు మండల జెడ్పీటీసీ సభ్యులతో రాజీనామాలు చేయించారు. ఈ వ్యవహారమంతా చంద్రబాబు దృష్టికి కూడా వెళ్ళింది. మంగళవారం ఉదయం విజయవాడలో తనతో బాలకృష్ణ, లోకేష్ సమావేశమైనప్పుడు బాబు... శేఖర్‌ని తక్షణమే తొలగించాలని సూచించారు. అటు నిమ్మకూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య కూడా శేఖర్ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పార్టీ క్రమశిక్షణను ఎవరు అతిక్రమించినా సహించే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించిన విషయం గమనార్హం.Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Widgets Magazine
Loading comments ...

తెలుగు వార్తలు

news

అమ్మను తోసేశారు.. శశికళ సీఎంగా వద్దే వద్దన్న పాండ్యన్-పన్నీర్‌కే మళ్లీ పట్టం అంటోన్నకేంద్రం

తమిళనాడులో ఏం జరుగుతోంది.? కేంద్రం ఎవరిపై మొగ్గుచూపుతుంది? ఒకటి రెండు రోజులు గవర్నర్ ...

news

దుస్తులు తీయించి.. గ్రౌండ్‌లో నిలబెట్టిన వీడియో తీసిన కీచక హెడ్మాస్టర్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కీచక ప్రధానోపాధ్యాయుడి అరాచకం వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో ...

news

పెద్ద నోట్ల రద్దు.. మోడీదే తప్పంతా.. భారతదేశం ఎటుపోతుందో?: స్టీవ్ హెచ్ హంకీ

పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీపై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు ...

news

వెంటిలేటర్‌పై ఉన్న పార్టీకి ఆశా"కిరణం"... రాహుల్‌తో చర్చలు...

సాధారణంగా రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి వస్తే ఆ పార్టీలోకి తిరిగి ...