గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2015 (14:31 IST)

రాజధానికి కొత్త ముహూర్తం: అక్టోబర్ 22 నుంచి కార్యకలాపాలు!?

ఆంధ్రప్రదేశ్ రాజధానికి కొత్త ముహూర్తం ఖరారు కానుంది. కొత్త రాజధాని శంకుస్థాపనకు వస్తున్న ప్రధాని మోడీ చేతులమీదుగా తాత్కాలిక రాజధానికి కూడా ప్రారంభోత్సవం చేయించాలని ప్రభుత్వ వర్గాలు భావించాయి. అయితే ఈ ఆలోచనలన్నీ ఉద్యోగుల సహకారంపై ఆధారపడి ఉంటడంతో ప్రభుత్వం సందిగ్ధలో పడిపోయాయి. అందుకే ఉద్యోగుల మనోగతం తెలుసుకొనే ప్రయత్నంలో ఉన్నతాధికారులు ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి. మొత్తంగా దసరా నుంచే తాత్కాలిక రాజధాని అందుబాటులోకి రావడం మంచి పరిణామమని ఏపీ ప్రజలు భావిస్తున్నారు. 
 
విజయవాడలో తాత్కాలిక రాజధానిని ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన అక్కడినుంచి కొనసాగించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అయితే ఇందుకు పలు సమస్యలు అడ్డంకిగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో పలు సందర్భాల్లో ప్రారంభం తేదీలు మారిపోయాయి. తాజాగా కొత్త ముహూర్తం ఖరారైంది.
 
ఈ ఏడాది దసరా నుంచి తాత్కాలిక రాజధాని పాలన షురూ చేయాలని భావిస్తున్నారు. అంటే అన్నీ కుదిరితే అక్టోబర్ 22వ తేదీ నుంచి కార్యకలాపాలు కొనసాగించాలని నిర్ణయించారు. ఆ రోజుకు కొన్ని శాఖలనైనా హైదరాబాద్ నుంచి బదిలీ చేసి తాత్కాలిక రాజధాని నుంచే పని చేసేలా చూడాలన్నది ప్రభుత్వం ఆలోచనగా ఉన్నట్లు సమాచారం. ఉద్యోగులు సహకరిస్తే అక్టోబర్ 22 నుంచి రాజధానిలో తమ పనులను ప్రారంభించవచ్చునని.. అలా కాకుంటే కేపిటల్ సిటీ నుంచి కార్యకలాపాలను ప్రారంభించడంలో జాప్యం ఏర్పడుతుందని ప్రభుత్వాధికారులు అంటున్నారు.