Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

2017-18 ఇ-ప్రగతి పాలన, చంద్రబాబు నాయుడు ప్లాన్

గురువారం, 16 ఫిబ్రవరి 2017 (21:25 IST)

Widgets Magazine
chandrababu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి 2017-18ని ‘ఇ-ప్రగతి పాలన’ సంవత్సరంగా ప్రకటించింది. రాష్ట్రంలో ఇ-ప్రగతి ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డిజిటల్‌ ఇండియా స్ఫూర్తితో సమాచార, సాంకేతిక రంగాల్లో దేశంలోనే అత్యున్నతంగా నిలిపేందుకు 'ఇ-ప్రగతి' ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. కేంద్రం డిజిటల్‌ ఇండియాను రూపొందించడంతో అన్ని రాష్ట్రాల కన్నా ముందే దాని అమలకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. కేంద్ర సంస్థలు వచ్చే వరకు ఆగకుండా రాష్ట్రంలో తామే జాతీయ ఆప్టికల్‌ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును నిర్మించుకుంటామని ప్రకటించింది. ఇలా ప్రకటించిన ఘనత ఏపీకే దక్కుతుంది. 
 
బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ‘ఇ-ప్రగతి’పై చర్చించారు. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఇ-ప్రగతి పనులు ముమ్మరంగా జరగాలని నిర్ణయించారు. ఈ సారి జరిగే జిల్లా కలెక్టర్ల సదస్సు నాటికి ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఆన్ లైన్ లోనే జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఆదేశించారు. ప్రతినెలా ఒక కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించాలన్నారు. ఏయే శాఖలను మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందో ముందు గుర్తించాలని చెప్పారు. ఇ-ప్రగతి ప్రాజెక్ట్ లో ప్రధానంగా  భాగం కావలసినవి పీపుల్స్ హబ్‌, ల్యాండ్ హబ్, ఇ-నిధి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి పూర్తిచేయాలన్నారు. 
 
ఇ-ప్రగతిలో లోకలైజేషన్, టెంపుల్ మేనేజ్‌మెంట్, హైబ్రిడ్ క్లౌడ్, సన్ రైజ్ స్కోర్ బోర్డ్, సైబర్ సెక్యూరిటీ, డేటా ఎనలిటిక్స్, ప్రైమరీ సెక్టార్, ఎడ్యుకేషన్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, కార్డ్ ప్లస్ ప్లస్, ఇ-ప్రగతి కోర్, పెర్ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్, స్మార్ట్ వాటర్, సేఫ్ ఏపీ, హెల్త్ ప్రాజెక్టులుగా సీఎం వివరించారు. గ్రామస్థాయి నుంచి అన్ని ఫైళ్లు ఆన్‌లైన్‌లో ఉంచాలని, ప్రతి ఫైలు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.  రికార్డుల ఇ-ఫైలింగ్ ఎంత మేర పూర్తయ్యింది? చట్టబద్దంగా హార్డ్ కాపీలను ఎలా భద్రపరచాలి? అనే అంశాలపై పూర్లి వివరాలను వచ్చే కలెక్టర్ల  సమావేశం నాటికి సిద్ధం చేయాలని ఆదేశించారు.
 
అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని ఉన్నత స్థానంలో నిలపాలన్న ఉద్ధేశంతో 2015 జులైలో ఇ-ప్రగతి ప్రాజెక్టును ప్రారంభించారు. ఫైబర్‌ గ్రిడ్‌తో రాష్ట్రం మొత్తం అనుసంధానం చేసే కార్యక్రమం పూర్తి కావస్తోంది. ఫైబర్ గ్రిడ్ ద్వారా రాష్ట్రంలో సాంకేతిక విప్లవం మొదలైంది.  ఇంటర్నెట్, మొబైల్ విప్లవంతో ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది. ఈ రోజు బ్రాడ్ బ్రాండ్ లేని గ్రామం లేదు. అత్యధికులు ఇంటర్నెట్ వాడుతున్నారు. ఈ తరుణంలో బ్రాడ్ బ్రాండ్ విప్లవం ద్వారా అభివృద్ధి సాధించాలన్నది ప్రభుత్వం లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫైబర్‌నెట్‌ సేవల తొలి దశ పూర్తి అయింది. ఫైబర్ నెట్ సేవలు తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లె మండలం మోరీ, మోరిపోడు గ్రామాల్లో గత నెలలో మొదలయ్యాయి. 
 
ఏపీఎస్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌(ఏపీఎస్ఎఫ్ఎల్) ఆధ్వర్యంలో ఫైబర్ గ్రిడ్ పనులు జరుగుతున్నాయి. మొదట ఈ రెండు గ్రామాల్లోని పాఠశాలలతోపాటు 1200 ఇళ్లకు ఫైబర్‌ నెట్‌ సేవలు అందించే ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలందించడానికి ఏర్పాట్లు చేశారు.  తొలి దశలో పట్టణ ప్రాంతాల్లోని ఇళ్లకు ఎంఎస్ఓ(మల్టీ సిస్టమ్ ఆపరేటర్)లు, ఎల్సీఓల ద్వారా  ఫైబర్ నెట్ సేవలు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికి దాదాపు పది వేల నెట్ కనెక్షన్లు ఇచ్చారు. మంత్రి మండలి సమావేశంలో ఫైబర్ గ్రిడ్ పై అధికారులతో సీఎం చర్చించారు. ఈ నెలాఖరునాటికి లక్ష బాక్సులు అమర్చాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 15 నాటికి పది లక్షల కనెక్షన్లు ఇచ్చే ఏర్పాటు చేయాలన్నారు.
 
దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలలో కూడా ఫైబర్ గ్రిడ్ సేవలు అందిస్తారు. విస్తృత స్థాయిలో ఈ సేవలను వినియోగించుకోవాడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో మొత్తం లక్షా 30 వేల కనెక్షన్లు ఇవ్వవలసి ఉంది. ఈ ప్రాజెక్టుని ఈ ఏడాది చివరకు పూర్తి చేయాలన్నది లక్ష్యం. దేశంలో ఇటువంటి పథకం చేపట్టిన రాష్ట్రం మనదే. ఉత్తరాంధ్ర జిల్లాలలతో పాటు 8 జిల్లాలలో ఈ పనులు పూర్తి అయ్యాయి. మిగిలిన జిల్లాలలో కూడా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. మొత్తం 23,500 కిలో మీటర్ల ఆప్టికల్ ఫైబర్ లైన్లు ఏర్పాటు చేయవలసి ఉంది. అందులో 22 వేల కిలోమీటర్లకుపైగా లైన్లు పూర్తి అయ్యాయి. ఇప్పటికే ప్రభుత్వ విభాగాలన్నింటిలో డిజిటలైజేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. కొన్ని శాఖల్లో నూరు శాతం  పూర్తి అయింది. ఈ విధంగా కొత్త శకానికి నాంది పలికి దేశంలో రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు పొందింది.
 
 
పారదర్శక పాలన, పౌరులందరికీ సత్వర సేవలు  అందించేందుకు 133 ప్రభుత్వ విభాగాలలో అన్నిరకాల సేవలను డిజిటలైజేషన్ చేస్తున్నారు. 33 శాఖలు, 315 సంస్థలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంటర్‌ప్రైజ్ ఆర్కిటెక్చర్‌ (ఏపీఎస్ఈఏ)లో భాగంగా మొత్తం 745 సేవలను అనుసంధానం చేసేలా ‘ఇ-ప్రగతి’ రూపకల్పన జరిగింది. ఇటువంటి ప్రాజెక్టు చేపట్టిన రాష్ట్రం దేశంలోనేకాదు దక్షిణాసియాలోనే మొదటిది ఏపీ. వాస్తవానికి ఇది ఒక ప్రాజెక్టు కాదు. పరిణామ క్రమంలో కాలానుగుణంగా వచ్చే సాంకేతిక మార్పులు, అవసరాలు, వ్యూహాలు, నూతన ఆవిష్కరణలను అనుసరించి నిరంతరం కొనసాగే ఒక సాంకేతిక ప్రక్రియ. 
 
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని  పరిపాలనకు అన్వయించడం ద్వారా సర్టిఫికెట్‌లెస్ గవర్నమెంట్ సిస్టమ్ (సీఎల్జీఎస్), డయల్ ఏపీ, మన రాష్ట్రం, టెలీహెల్త్, ఇ-ఎడ్యుకేషన్, హరిత, ఇ-మండీ, సిటిజెన్ ఇన్ బాక్స్, డిజిటల్ లిటరసీ, ఇ-ఎస్‌హెచ్‌జీ, స్మార్ట్ సిటీ, స్మార్ట్ గ్రిడ్ తదితర సేవలన్నీ రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.  ప్రజల ఆరోగ్యం, పాఠశాలల్లో డ్రాపవుట్ రేటు తదితర ప్రామాణికాల నిర్దారణకు ఇ-ప్రగతి ప్రాజెక్టు ఉపకరిస్తుంది. మీ సేవ, సీఎం డ్యాష్ బోర్డు, మీ భూమి తదితర కామన్ ఆప్లికేషన్లతో పాటు ఆర్థిక, సీఆర్డీఏ, పట్టణాభివృద్ధి వంటి ప్రభుత్వ శాఖల సమగ్ర సమాచారాన్ని పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. కేటగిరిలవారీగా, అన్ని వయసుల వారికి సమగ్ర సమాచారం  అందించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఇందులో భాగంగానే స్మార్ట్‌ పల్స్‌ సర్వే ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి, డిజిటలైజ్ చేస్తున్నారు. ఈ నెల 16వ తేదీ వరకు 1,37,42,586 కుటుంబాలకు చెందిన 4,32,55,924 మంది వివరాలు సేకరించారు.
 
ఇ-ప్రగతి ద్వారా అన్ని శాఖల సమాచారాన్ని ప్రతి పౌరుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ప్రాథమిక రంగం మిషన్‌లోని వ్యవసాయం, ఉద్యానవనాలు, మత్స్య పరిశ్రమ, పశు సంవర్ధకం తదితర అనుబంధ రంగాల సమాచారాన్ని ఇ-ప్రగతి ప్రాజెక్టు సేవల ద్వారా పొందవచ్చు. పంటలు, భూములు, విత్తనాలు, బీమా, మార్కెటింగ్, ఇ-మండీ తదితర వివరాలన్నీ లభ్యమవుతాయి.  మాన్యువల్‌గా చేసే వేల కొద్దీ పనులు ఈరోజు ఐటీ సహాయంతో వేగంగా చేయగలుగుతున్నారు. ఐటీ వల్ల పారదర్శకత, జవాబుదారీతనం, పనుల్లో వేగం సాధ్యమవుతుంది. రెవిన్యూశాఖలో 113 సర్టిఫికెట్ల కోసం ప్రజలు నిత్యం ఇబ్బంది పడేవారు. ఆ ఇబ్బందిని ఇప్పడు చాలా వరకు తగ్గించారు. ముందుముందు సర్టిఫికెట్‌లెస్ గవర్నెన్స్ సిస్టమ్ ప్రవేశపెడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల అవసరాలకు గతంలో మాదిరిగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగవలసి అవసరం ఇకముందు ఉండదు. ఇప్పటికే కుల, ఆదాయ ధృవీకరణ, ఇసీ, బీ1 అడంగుల్... వంటి దాదాపు 600 సేవలు అందుబాటులోకి వచ్చాయి. లేబర్ లైసెన్సులు, పారిశ్రామిక అనుమతులు, అన్ని రకాల పన్నులు, ఇతర బిల్లుల చెల్లింపులు వంటివి ఆన్‌లైన్‌లో జరిగిపోతున్నాయి. 
 
అన్ని ప్రభుత్వ శాఖల, రాష్ట్రంలోని భూమి, లేఅవుట్లు, ఇళ్లు, రోడ్లు, దేవాలయాలు, భూగర్భజలాలు.. ఇలా ఒక్కటేమిటి సమగ్ర సమాచారం ఆయా శాఖల వెబ్ సైట్ లలో పొందుపరుస్తున్నారు. ఈ ప్రక్రియ శరవేగంగా జరిగిపోతోంది. ఇప్పటికే కొన్ని శాఖలు తమ పరిధిలోని  సమాచారాన్ని చాలా వరకు వెబ్ సైట్లలో ప్రజలకు అందుబాటులో ఉంచాయి. అందుకు నిదర్శనంగా పట్టణ గ్రామీణ ప్రణాళికా శాఖ (డీటీసీపీ-డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్) వెబ్ సైట్ ను పేర్కొనవచ్చు. ఈ వెబ్ సైట్ లో రాష్ట్రంలోని సీఆర్ డీఏ మొదలుకొని పట్టణాభివృద్ధి సంస్థలు, నగరాలు, పట్టణాలు, నగర పంచాయితీల వంటి వాటి మాస్టర్ ప్లాన్లు, అనుమంతి పొందిన లేఅవుట్ల, వాటికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు, సంబంధిత చట్టాల సమాచారం అంతా  ఉంది. ఆయా ప్రాంతాలలో లేఅవుట్లు, భవన నిర్మాణాలు, గ్రూప్ హౌస్‌లు లాంటి అన్ని రకాల అనుమతులకు కావలసిన దరకాస్తులు ఉన్నాయి. అన్ని దరకాస్తులను ఆన్ లైన్ లోనే చేసుకోవచ్చు. ఫీజులను కూడా ఆన్ లైన్ లోనే చెల్లించవచ్చు. దరకాస్తు ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు.
 
ఈ విధంగా ప్రతి శాఖకు సంబంధించి అందుబాటులో ఉన్న పూర్తి సమాచారంతోపాటు ప్రతి పౌరుడి సమాచారాన్ని డిజిటలైజ్ చేస్తున్నారు. సీఎం డ్యాష్ బోర్డులో అయితే ప్రభుత్వ విభాగాలలో ఏ పని ఎంత వరకు జరిగిందో ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ఉంటుంది. కొన్ని విభాగాల్లో ప్రతి 5 నిమిషాలకు జరిగిన మార్పులను ఎంటర్ చేస్తారు. కొన్ని విభాగాలు రోజుకు ఒకసారి, వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి, మరికొన్ని నెలకు ఒకసారి, ఇంకొన్ని మూడు నెలలకు ఒకసారి అప్ డేట్ చేస్తారు.  వర్షపాతం దగ్గర నుంచి భూగర్భ జలాలు, రెవెన్యూ ఆదాయం, ఎక్సైజ్ ఆదాయం, సివిల్ సప్లైస్ వారు రేషన్ డిపోలకు పంపే సరుకుల వివరాలు మొదలైనవన్నీ ఉంటాయి. ఈ విధంగా ఇ-ప్రగతి ప్రాజెక్ట్ పూర్తి అయితే ప్రభుత్వంలోని అన్ని పనులు ఆన్ లైన్ లో జరిగిపోతాయి. ప్రభుత్వ పరంగా ప్రజలకు కావలసిన పనులు త్వరితగతిన అవడానికి అవకాశం ఏర్పడుతుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Andhrapradesh Govt E-pragati Palana

Loading comments ...

తెలుగు వార్తలు

news

శశికళను ఎగదోసిన తంబిదొరైకు మోదీ షాక్... ఎన్డీఏలో మంత్రులుగా సెల్వం ఎంపీలు...?

పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ, ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం... ఇదీ భాజపా ఫార్ములా అనే ...

news

సీఎంగా పదవీ ప్రమాణం చేసిన పళని స్వామి: సోమవారం బల నిరూపణకు ముహూర్తం.. దినకరన్‌కు నో ఛాన్స్

పళని స్వామి తమిళనాడు రాష్ట్ర సీఎంగా పదవీ ప్రమాణం చేశారు. దర్భారు హాలులో జరిగిన ఈ ...

news

ఎమ్మెల్యేలు రిసార్ట్ నుంచి బయటికొస్తే.. పరిస్థితులు మారిపోతాయా? దీప మాట్లాడితే శశివర్గానికే దెబ్బే!

చిన్నమ్మ శశికళ రాజకీయ వ్యూహం ముందు పన్నీర్ సెల్వం.. బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోయారు. ...

news

పన్నీరు కొంప ముంచిన భాజపా, శశికళను నమ్ముకుని వుంటే పన్నీరే కింగా?

డ్యామిడ్... కథ అడ్డం తిరిగింది. ఒక్కొక్కప్పుడు ప్రజలంతా మాకొద్దు బాబోయ్ అంటున్నా ఇష్టం ...

Widgets Magazine