శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 27 జులై 2015 (18:04 IST)

రిషికేశ్వరి ఫేస్ బుక్ పేజ్‌కు అంత రెస్పాన్సా?: 14వేల మంది నెటిజన్లతో..?

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ విద్యార్థిని రిషికేశ్వరి సూసైడ్ కేసుకు సంబంధించి.. ''వీ వాంట్ జస్టీస్ ఫర్ రిషికేశ్వరి- రైజ్ యువర్ వాయిస్ కమ్యూనిటీ'' పేరిట గల ఫేస్ బుక్ పేజీకి మంచి స్పందన లభిస్తోంది. ర్యాంగింగ్ వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన రిషికేశ్వరి ఫేస్ బుక్ పేజీకి 14వేల మంది సభ్యులుగా ఉన్నారని తెలిసింది. ఈ పేజీలో రిషికేశ్వరి సూసైడ్‌, కేసు పురోగతి వంటి ఇతరత్రా వివరాలున్నాయి. 
 
ఇంకా రిషికేశ్వరి ఆత్మహత్యపై నెటిజన్స్ తమదైన శైలిలో స్పందించడం మాత్రమే గాకుండా.. ఫేస్ బుక్ వేదికగా ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. రిషికేశ్వరి ఆత్మహత్య విషయాన్ని ముందుగా గర్ల్స్ హాస్టల్ కంటే ముందుగా బాయ్స్ హాస్టల్‌కు ఎలా చేరిందని నిలదీస్తున్నారు. లేడిస్ హాస్టల్ వాడెన్ కంటే ముందు బాయ్స్ హాస్టల్‌కు ఈ వివరాలు ఎలా చేరాయని, కాలేజీ ప్రిన్సిపల్ రాజీనామా డ్రామా, కాలేజీకి పది రోజులు సెలవులు ప్రకటించజం వంటి అంశాలపై నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.